Krishna Kowshik
చావు ఎలా ఎవ్వరికీ, ఎప్పుడు, ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. ఊహించని విధంగా వచ్చి ఉసురు తీస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడానే ఉండదు. అలా వచ్చి చిటికెలో ప్రాణాలను మెలికపెట్టి తీసుకెళుతుంది. అలాంటిదే ఈ సంఘటన..
చావు ఎలా ఎవ్వరికీ, ఎప్పుడు, ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. ఊహించని విధంగా వచ్చి ఉసురు తీస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడానే ఉండదు. అలా వచ్చి చిటికెలో ప్రాణాలను మెలికపెట్టి తీసుకెళుతుంది. అలాంటిదే ఈ సంఘటన..
Krishna Kowshik
పేదరాశి పెద్దమ్మ నాటి కాలంలో ఒక కథ ఉండేది. ఓ గొప్పింటి వ్యక్తి.. తన కుమారుడికి జాతకం చూపించగా..రెండు రోజుల్లో చనిపోతాడని తెలుస్తుంది. అది కూడా రాయి రూపంలో చావు సంభవిస్తుందని చెబుతారు జ్యోతిష్యులు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు.. బిడ్డను రక్షించుకోవాలని తపన పడుతుంటారు. బయటకు వెళితే.. ఏదో ఒక రాయి తగిలి చనిపోతారని, ఇంట్లో గుండ్రాయి కూడా రాయి కిందకు వస్తుందని గ్రహించి.. తమ బిడ్డను ఒక రూంలో బంధించి ఉంచుతారు. అతడు బయటకు రాకుండా.. వీళ్లే అన్నం పంపిస్తారు. జ్యోతిష్యులు చెప్పిన రోజు రానే వచ్చింది. యథాతథంగా బిడ్డకు కంచెంలో అన్నం ఇచ్చింది తల్లి. కానీ తెల్లారే సరికి చనిపోయి కనిపించాడు. ఎందుకంటే.. అన్నంలో ఉన్న రాయి.. గొంతుకు అడ్డం తగిలి చనిపోయాడు.
అంటే చావు ఎలా ఎవ్వరికీ, ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో తెలియదు అని చెప్పేందుకు ఈ కథ ఓ ఉదాహరణ. కొన్ని మరణాలు చూస్తుంటే.. ఆశ్చర్యంగా అనిపించకమానదు.. ఆవేదన చెందకుండా ఉండలేం. అటువంటి సంఘటనే హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ సమీపంలోని బాలానగర్ మండలం మామిడిగుట్ట తండాకు చెందిన 13 ఏళ్ల మున్నా ఇంట్లో మటన్ వండగా.. తిన్నాడు. అంతలో ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిలలాడిపోయాయి. కుటుంబ సభ్యులు వెంటనే షాద్ నగర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మున్నాను పరిశీలించగా.. అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మటన్ ముక్క అతడి ప్రాణాలు తీసింది.