iDreamPost
android-app
ios-app

Ayodhya: ఎంత గొప్ప భక్తురాలు.. రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం!

  • Published Jan 09, 2024 | 12:19 PM Updated Updated Jan 09, 2024 | 1:59 PM

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం కోసం గత కొన్నేళ్లుగా ఎంతో మంది పోరాటం చేశారు. ఎట్టకేలకు వారి కల నెరవేరబోయే సమయం అతి చేరువలో ఉంది. అన్ని వేల పోరాటాల నడుమ ఓ మౌనపోరాటం కూడా గత ముప్పై ఏళ్లుగా కొనసాగుతూనే ఉందంటే నమ్మగలమా!

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం కోసం గత కొన్నేళ్లుగా ఎంతో మంది పోరాటం చేశారు. ఎట్టకేలకు వారి కల నెరవేరబోయే సమయం అతి చేరువలో ఉంది. అన్ని వేల పోరాటాల నడుమ ఓ మౌనపోరాటం కూడా గత ముప్పై ఏళ్లుగా కొనసాగుతూనే ఉందంటే నమ్మగలమా!

  • Published Jan 09, 2024 | 12:19 PMUpdated Jan 09, 2024 | 1:59 PM
Ayodhya: ఎంత గొప్ప భక్తురాలు.. రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం!

త్రేతాయుగంలో ఆ రామయ్య తండ్రి కోసం శబరి కొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూస్తూనే ఉంది. ఆమెకు ముసలి తనం వచ్చి, పళ్ళు ఊడిపోయి, కంటి చూపు తగ్గినా కూడా.. రామయ్య ఆమెకోసం వస్తాడు అనే నమ్మకం ఏ మాత్రం తగ్గలేదు. ఆ శ్రీరామచంద్రుని మీద శబరికి ఉన్న అపారమైన విశ్వాసం.. రాముడిని శబరి వద్దకు చేర్చింది. ఆ రామయ్య తన వద్దకు ఖచ్చితంగా వస్తాడు అనే ఆమె నమ్మకమే వారిని కలిపింది. అయితే, ఇప్పుడు అదే పద్దతిలో ఈ కలియుగంలో కూడా శబరి రూపంలో ఉన్న ఓ వృద్ధురాలు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలని గత ముప్పై సంవత్సరాలుగా మౌనవ్రతం చేస్తుంది. ఈ జనవరి 22న బాల రాముడి ప్రతిష్ట రోజున తన మౌన దీక్ష విరమించుకోనుంది.

జార్ఖండ్‌ లోని ధన్‌బాద్‌ కు చెందిన 85 ఏళ్ళ వృద్ధురాలు సరస్వతి అగర్వాల్ . అయితే, అయోధ్య రామ మందిరం నిర్మించాలని ఎంతో మంది నిరసనలు, పోరాటాలు ఇలా ఎన్నో చేశారు. ఈ క్రమంలోనే ముప్పై సంవత్సరాల క్రితం సరస్వతి రామయ్య మందిరం కోసం మౌన దీక్షను చేపట్టింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ఆ రామయ్యను ప్రతిష్టించేవరకు.. ఎవరితోనూ మాట్లాడాను అని ఆమె శపధం చేసింది. నిత్యం శ్రీరాముని స్మరణనే జపిస్తూ ఆ రామయ్యను భక్తి పారవశ్యంతో కొలుస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం సరస్వతి చేపట్టిన మౌన దీక్ష.. ఈనాడు అయోధ్యలో రామ మందిరం నిర్మించడంలో ఓ పాత్రగా నిలిచింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుండడంతో సరస్వతి ఆనందానికి అవధులు లేవు.

30 years of silence for Ram temple3

కాగా, ఇన్ని సంవత్సరాల ఆమె మౌనాన్ని.. అయోధ్యలో రామయ్య ప్రతిష్టాపన రోజునే ‘రామ్, సీతారాం’ అంటూ దీక్షను విరమించనుంది. ఇక ఆమె తదుపరి జీవితాన్ని కూడా అయోధ్యలోనే రామయ్య సేవ చేసుకుంటూ.. గడపాలని నిశ్చయించుకుందట. ఆ రామయ్య తండ్రి కరుణా కటాక్షం తనపై ఉంది అంటూ సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఈ క్రమంలో ఆమె తన భావాలను ఈ విధంగా వ్యక్తపరిచింది.”నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. నా కల నెరవేరింది. ముప్పై ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. నా తదుపరి జీవితాన్ని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలోనే గడపాలి అనుకుంటున్నాను” అంటూ.. మీడియాతో వ్యక్తపరిచింది.

కాగా, జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి.. సరస్వతి అగర్వాల్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను అయోధ్యకు తీసుకుని వెళ్లారు. అయితే ఆమె మొదటసారి 1992లో అయోధ్యకు వెళ్లారు. అక్కడ రామ జన్మభూమి ట్రస్ట్ అధినేతను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన స్ఫూర్తితోనే ఈ మౌనవ్రతాన్ని చేపట్టి.. రామయ్య ఆశీస్సులతో దిగ్విజయంగా మరికొన్ని రోజులలో పూర్తి చేసుకోనున్నారు. ఏదేమైనా, ఇలా ఎంతోమంది భక్తులు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం కోసం.. తమకు వీలైన కృషిని చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు కోట్లాది మంది కలలు నెరవేరబోతున్నాయి. మరి, అయోధ్యలో రామ మందిరం కోసం ముప్పై ఏళ్లుగా మౌనం పాటిస్తున్న.. జార్ఖండ్ కు చెందిన సరస్వతి అగర్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.