Keerthi
సాధారణంగా బిస్కెట్స్ అంటే అందరికి ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే వాటిని మరి ఇష్టంగా తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా మార్కెట్ లోని ఓ ప్రముఖ బ్రాండెడ్ బిస్కెట్ ప్యాకెట్ ను ఓపెన్ చేయగా ఓ వ్యక్తికి ఊహించని షాకింగ్ సంఘటన ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..
సాధారణంగా బిస్కెట్స్ అంటే అందరికి ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే వాటిని మరి ఇష్టంగా తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా మార్కెట్ లోని ఓ ప్రముఖ బ్రాండెడ్ బిస్కెట్ ప్యాకెట్ ను ఓపెన్ చేయగా ఓ వ్యక్తికి ఊహించని షాకింగ్ సంఘటన ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..
Keerthi
సాధారణంగా బిస్కెట్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. చిన్న వారి దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ బిస్కెట్స్ ను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చిన్నా పిల్లలకి ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఈ క్రమంలోనే.. మార్కెట్ లో రకరకాల బిస్కెట్స్ ను విక్రయిస్తుంటారు. దీంతో ఎవరికి నచ్చిన బిస్కెట్స్ ను వారు మార్కెట్ లో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ బిస్కెట్స్ ను కాలి సమయాల్లోనూ, టీ, కాఫీలతోను చాలామంది స్నాక్స్ లా తింటుటారు. ఇక పిల్లల విషయానికొస్తే.. వారు అల్లరి పెట్టిన, స్కూల్ కి వెళ్లాలన్నా స్నాక్స్ కింద ఈ బిస్కెట్స్ ను ఇస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఈ బిస్కెట్స్ లో కూడా దారుణంగా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆ బిస్కెట్స్ ప్యాకెట్ న ఓపెన్ చేస్తే.. అందులో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ బిస్కెట్స్ ప్యాకెట్ ని ఓ చిన్నారి తినాలని ప్యాకెట్ ఓపెన్ చేయగా అందులో పురుగులు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తాజాగా కర్నూల్ లోని ఆదోని పట్టణంలో ఎంఎం కాలనీకి చెందిన మనోజ్ కుమార్ తన పిల్లలకి బిస్కెట్స్ కోసమని దుకాణానికి వెళ్లి అక్కడ ఓ ప్రముఖ బిస్కెట్ ప్యాకెట్ ను కొనుగోలు చేశాడు. దీంతో ఆ ప్యాకెట్ ను తమ పిల్లల తినిపిద్దామని సదరు వ్యక్తి ప్యాకెట్ ఓపెన్ చేయగా.. అందులో పురుగులను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే పేరుకు పెద్ద బ్రాండ్ కంపెనీకు చెందిన బిస్కెట్లలో ఇలా పురుగులు ఉండటం చూసి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక ఈ బిస్కెట్స్ తింటే పిల్లల ఆరోగ్యం ఏమైపోతుందనని వాపోతున్నారు. అయితే ఇలాంటి నాసిరకం బిస్కెట్లను తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల కవర్లతో ప్యాక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా సదరు కంపెనీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కాగా, ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. బయట పిల్లలకు ఏం కొని పెట్టి ఇవ్వలన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటి వరకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ లోనే షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తే.. ఇప్పుడు ఏకంగా బిస్కెట్స్ లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం అందరూ భయంద్రోళనకు గురవుతున్నారు. మరి, ప్రముఖ బ్రాండెడ్ బిస్కెట్స్ లో పురుగులు వచ్చిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.