iDreamPost
android-app
ios-app

Rishi Sunak నెక్ట్స్ UK ప్రధానమంత్రి ఎంపిక‌లో, 1వ రౌండ్ ఫ‌స్ట్ ప్లేస్ లో రిషి సునక్

  • Published Jul 14, 2022 | 1:23 PM Updated Updated Jul 14, 2022 | 1:24 PM
Rishi Sunak నెక్ట్స్ UK ప్రధానమంత్రి ఎంపిక‌లో, 1వ రౌండ్ ఫ‌స్ట్ ప్లేస్ లో రిషి సునక్

బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరగనున్న ఎన్నికలో ఇద్దరు భారత సంతతికి చెందిన రిషి సునక్, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్ మాన్ లు పోటీప‌డ్డారు. ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీప‌డ‌టానికి ఎంపిక చేసిన 8 మందిలో వీరిద్దరూ భారత సంతతికి చెందిన వారే. కాని మొద‌టి రౌండ్ త‌ర్వాత రిషి సున‌క్ మొద‌టి స్థానంలో ఉంటే, సుయెల్లా బ్రేవ‌ర్ మాన్ ఆరో స్థానంలో ఉన్నారు. రెండో రౌండ్ త‌ర్వాత ఆమె త‌ప్పుకోనున్నారు. అంటే ఒక పోటీలో మిగిలిన భార‌త సంత‌తి నేత, రిషి సున‌క్(rishi sunak)

ప్రధానమంత్రి పదవి పోటీకి కనీసం 20 మంది ఎంపీల మద్దతు కచ్చితంగా కావాల్సిఉంది. ఈ పదవి రేసులో ఉన్న 8 మంది అభ్యర్థుల్లో ఇద్ద‌రు తొలి రౌండ్ ఓటింగ్ త‌ర్వాత పోటీ నుంచి త‌ప్పుకున్నారు. కనీసం 30 మంది ఎంపీల మద్దతు ఉన్నవారే గురువారం జరిగే రెండో రౌండ్ కు అర్హత సాధిస్తారు. ఈ నెల 21 నాటికి పోటీలో ఇద్దరు పోటీదారులే మిగిలే వ‌ర‌కు రౌండ్స్ నిర్వహిస్తారు.

మొద‌టి రౌండ్ పోటీ త‌ర్వాత రిషి సున‌క్(Sunak) కి 88 మంది మ‌ద్దతు ద‌క్కింది. ఇక రెండో ప్లేస్ లో అనూహ్యంగా పెన్నీ మోర్డాన్ట్ (Ms Mordaunt) దూసుకొచ్చారు. రిషితో గ‌ట్టిగా పోటీప‌డ‌తార‌నుకున్న లిజ్ ట్రూజ్ 50 ఓట్ల‌కే ప‌రిమిత‌మైయ్యారు. ఇక భార‌తీయ సంత‌తికి చెందిన సుయెల్లా బ్రేవ‌ర్ మేన్ 32 ఓట్ల‌తో ఆరో స్థానంలో నిలిచారు. రెండో రౌండ్ లో ఆమె ఎలిమినేట్ కానున్నారు. ఒక‌వేళ ఆమె వ‌ర్గానికి ఎందిన ఎంపీల ఓట్లు సున‌క్ కు క‌నుక బ‌దిలీ అయితే ఆయ‌న మ‌రింత బ‌ల‌ప‌డొచ్చు.

రేసు వేడెక్కుతున్నందున, Ms మోర్డాంట్ లేదంటే మిస్టర్ సునక్ ల్లో, ఇద్ద‌రిలో ఒక‌రిరి ఓడించడానికి త‌గిన మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మైయ్యాయి. ఈరోజు రెండో రౌండ్ ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో బ్రేవర్‌మాన్ నాకౌట్ అయ్యే అవకాశం ఎక్కువ‌.