iDreamPost
android-app
ios-app

ముగ్గురూ ముగ్గురే – ప్రతిభాకిరణాలు

  • Published Nov 07, 2020 | 10:07 AM Updated Updated Nov 07, 2020 | 10:07 AM
  • Published Nov 07, 2020 | 10:07 AMUpdated Nov 07, 2020 | 10:07 AM
ముగ్గురూ ముగ్గురే – ప్రతిభాకిరణాలు

ఈ రోజు సోషల్ మీడియా ముగ్గురికి జన్మదిన శుభాకాంక్షలుతో హోరెత్తిపోతోంది. కమల్ హాసన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్కల బర్త్ డే సందర్భంగా అభిమానుల సందడి మాములుగా లేదు. ముగ్గురికి ముగ్గురు వారి వారి రంగంలో దిగ్గజాలు కావడంతో ఫ్యాన్స్ హంగామా ఎక్కువే ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ స్థిరపడింది తమిళంలోనే అయినా తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు స్వాతిముత్యం, సొమ్మొకడిది సోకొకడిది, సాగరసంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభసంకల్పం, ద్రోహి ఎంతో పేరుతో పాటు గొప్ప ఫాలోయింగ్ ఇచ్చాయి. డబ్బింగులు గురించి చెప్పుకుంటూ పోతే పేరాలు కాదు పుస్తకాలు కూడా సరిపోవు. విచిత్ర సోదరులు, కల్యాణరాముడు, భారతీయుడు, మైకేల్ మదన కామరాజు, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, దశావతారం లాంటి ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ఇక్కడి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. వివాదాలు ఎన్ని వచ్చినా తాను నమ్మిన సూత్రానికి కట్టుబడే కమల్ శైలి అందరికన్నా భిన్నం.

ఒక రైటర్ కి స్టార్ ఇమేజ్ రావడం చాలా అరుదు. అందులోనూ దర్శకులుగా మారి గొప్ప స్థాయికి చేరుకోవడం కూడా అంత సులభం కాదు. జంధ్యాల లాంటి ఒకరో ఇద్దరికో మాత్రమే అది సాధ్యమయ్యింది. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లాంటి నిష్ణాతులు కూడా డైరెక్టర్లుగా మారాక ఫెయిల్యూర్స్ చూసినవాళ్ళే. కానీ దీనికి భిన్నంగా కేవలం మాటలతోనే తనకో బ్రాండ్ ఏర్పరుచుకున్న త్రివిక్రమ్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వాళ్ళు ఎందరో. స్వయంవరం, నువ్వే కావాలి, చిరునవ్వుతో, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, జై చిరంజీవాలతో రచయితగా మెప్పించి నువ్వే నువ్వే, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్స్ తో దర్శకుడిగా రెండు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపించి ఇప్పటికీ తిరుగు లేని స్థానంలో ఉన్న త్రివిక్రమ్ ని గురుజీ అని ప్రేమతో పిలుచుకునే అభిమానులకు లెక్కే లేదు.

2005లో సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పరిచయమైనా అనుష్క ఆ తర్వాత విజయశాంతి స్థాయిలో సోలోగా తనకంటూ మార్కెట్ సృష్టించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. సమకాలీన కథానాయికలు గ్లామర్ పాత్రలకే పరిమితమవుతున్న తరుణంలో ఒకపక్క వాటిని చేస్తూనే మరోవైపు అరుంధతి లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టులో జేజెమ్మగా మెప్పించి నీరాజనాలు అందుకోవడం తనకే చెల్లింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో మొదలుపెట్టి ఇప్పటి జెనరేషన్ ప్రభాస్, మహేష్ బాబు లాంటివాళ్లుతోనూ జట్టు కట్టడం తనకే చెల్లింది. హీరో లేకుండా కేవలం తన పేరు మీదే సినిమాను మార్కెట్ చేయగలిగేంత డిమాండ్ తెచ్చుకున్న అనుష్క ఇటీవలే నిశ్శబ్దంతో నిరాశపరిచినా సరైన కథ పడితే మరోసారి సత్తా చాటుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే సినిమా రంగానికి చెందిన ఈ ప్రతిభాకిరణాల మీద ఇంటా బయటా ఇంత ప్రేమ కనిపిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet