iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ ప్రశంసలు – ముగ్గురి భావోద్వేగాలు

  • Published Dec 18, 2020 | 5:30 AM Updated Updated Dec 18, 2020 | 5:30 AM
బిగ్ బాస్ ప్రశంసలు – ముగ్గురి భావోద్వేగాలు

బిగ్ బాస్ 4లో ఇవాళ చివరి శుక్రవారం. ఎల్లుండి గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ కాబోతున్న తరుణంలో ప్రేక్షకులు దాని పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూట్ మాత్రం రేపే ఉంటుంది. చిరంజీవి ముఖ్యఅతిధిగా రావడం దాదాపు ఖాయమే. గత సీజన్ లో కూడా మెగాస్టార్ మెరుపులు ఇంకా ఆడియన్స్ మర్చిపోలేదు. మొన్న అఖిల్, అభిజిత్ ల ఎమోషనల్ జర్నీలను చూపించిన బిగ్ బాస్ ఇవాళ మిగిలిన అరియనా, హారిక, సొహైల్ ల ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇవి కూడా బాగా ఎమోషనల్ గా సాగాయి. బయట ప్రపంచంలో అంతగా గుర్తింపు లేని వీళ్లకు ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఈ షో తప్ప మరొకటి కాదు.

ఫస్ట్ హారిక వచ్చింది. తన మీద బిగ్ బాస్ మంచి పొగడ్తలు గుప్పించాడు. మేఘాలు కమ్ముకున్నా దూసుకొచ్చిన సూర్యకాంతని, చిన్నగా కనిపించే పెద్ద ధమాకా అంటూ కితాబు ఇచ్చేశాడు. తర్వాత హారిక మాట్లాడుతూ జీవితంలో చాలా గొప్పది సాధించానని లైఫ్ మొత్తం అయిపోయాక బిగ్ బాస్ చాప్టర్ దే మేజర్ రోల్ అని చెప్పుకుంది. అంతే కాదు ఆఖరిలో డాన్సు చేసి మరీ మురిపించింది. ఇక అసలైన సొహైల్ గురించి మాత్రం ఓ రేంజ్ ఎలివేషన్ నడిచింది. అతని ప్రేమను స్వచ్ఛమైనదిగా, అందరివాడిగా ప్రేమను సంపాదించుకున్నారని తెగ మెచ్చేసుకున్నాడు బిగ్ బాస్. ఫ్యూచర్ బాగుంటుందని భరోసా ఇచ్చాడు.

వీడియో అయ్యాక సొహైల్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటిదాకా తన సినిమా ఏది ఆడలేదని, ఆఖరికి తాను చూడాలనుకున్నా టికెట్ కొనే పరిస్థితి ఉండేదని, ఇకపై సోహైల్ నటిస్తే ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం వచ్చిందని చెప్పాడు. సినిమానే జీవితంగా భావించే తనకు బిగ్ బాస్ గొప్ప మార్గం వేసిందని భావోద్వేగానికి గురయ్యాడు. ఇక అరియనాకు కూడా ఇదే తరహాలో ట్రీట్మెంట్ కొనసాగింది. స్పెషల్ గా తనకు బాణాసంచా కూడా కాల్చాడు బిగ్ బాస్. ఈ రోజు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మరోసారి సందడి చేయబోతున్నారు. ఈ హంగామా తాలూకు ప్రోమో అప్పుడే హల్చల్ చేస్తోంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet