iDreamPost
android-app
ios-app

స్కూల్‌కెళ్తున్న విద్యార్థుల పడవ బోల్తా! 18 మంది..

స్కూల్‌కెళ్తున్న విద్యార్థుల పడవ బోల్తా! 18 మంది..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో  పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  అధిక వరద, పడవలో అధిక సంఖ్యలో మనుషులు ప్రయాణిచడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు జలసమాధి అవుతున్నారు. ఇటీవల యూపీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో 10 మంది జలసమాధి అయ్యారు. తాజాగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిహార్ రాష్ట్రపంలోని ముజఫర్ పూర్ జిల్లాలో బినియాబాద్ ప్రాంతంలోని విద్యార్థులు పొరుగు గ్రామంలో ఉన్న పాఠశాలకు పడవలో వెళ్తుండే వారు. ఆ పాఠశాలకు వెళ్లాలంటే.. సమీపంలో ఉన్న భాగమతి నది దాటాల్సి ఉంటుంది. గురువారం ఉదయం కూడా పక్కనే  గ్రామంలోకి వెళ్తేందుకు భాగమతి నది దాటేందుకు విద్యార్థులు పడవ ఎక్కారు. అయితే కాస్తా దూరం వెళ్లగానే  పడవ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి పైగా చిన్నారులు గల్లంతయ్యారని సమాచారం. ప్రమాద సమయంలో పడవలో 32 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు నాటు పడవలతో నదిలోకి వెళ్లి.. సహాయక చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే స్థానికులు కొంతమంది చిన్నారులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఇదే సమయంలో సమాచారమందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లైంతన వారి  కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముజఫర్‌పుర్‌ పర్యటనలోనే ఉన్న రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌.. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరి… ఇలాంట ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.