iDreamPost
android-app
ios-app

110 రోజుల పాటు ఉపవాసం చేసిన 16 ఏళ్ల అమ్మాయి..ఎందుకంటే..?

ఉపవాసం అంటే మహా అయితే ఒక పూట తినం, ఒక రోజు తినం. అదే కఠిన ఉపవాసం చేస్తే.. ఒక వారం తినకుండా ఉండగలుగుతారేమో.. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే బాలిక మాత్రం ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసిందట.. ఎందుకంటే..?

ఉపవాసం అంటే మహా అయితే ఒక పూట తినం, ఒక రోజు తినం. అదే కఠిన ఉపవాసం చేస్తే.. ఒక వారం తినకుండా ఉండగలుగుతారేమో.. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే బాలిక మాత్రం ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసిందట.. ఎందుకంటే..?

110 రోజుల పాటు ఉపవాసం చేసిన 16 ఏళ్ల అమ్మాయి..ఎందుకంటే..?

తమ కోర్కెలు తీర్చాలంటూ దేవుడ్ని మొక్కుతాం. గుడి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తాం. కుటుంబం చల్లగా ఉండాలని, బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని వేడుకుంటారు. ఇందు కోసం ఉపవాసాలు చేస్తుంటారు. ఒక పూట తినకూడదని లేదంటే.. ఉదయం నుండి రాత్రి వరకు పచ్చి మంచి నీళ్లు తాగకుండా ఉపవాసం చేస్తుంటారు. ఒక రోజు తినకపోతేనే.. నీరసించి పోతుంటారు. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు నెలల పాటు తినకుండా ఉపవాసం చేసింది. ఈ కఠిన ఉపవాసాన్ని పూర్తి చేసినందుకు కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు చేసుకోవడం గమనర్హం. ఇంతకు ఎక్కడ జరిగిందంటే.. మహారాష్ట్రలో.

వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని కందివాలిలో నివసిస్తోంది జిగర్ షా కుటుంబం. వీరిది గుజరాత్ అయినప్పటికీ..ముంబయిలో జీవిస్తున్నారు. జిగర్ షా స్టాక్ బ్రోకర్. భార్య గృహిణి. వీరు జైన మతాన్ని ఆచరిస్తుంటారు. వీరికి శ్లేఖ వ్రతాన్ని ఆచరించడం పరిపాటిగా కొనసాగుతుంది. ఇది అత్యంత కఠినమైన ఆచారం.. అయినప్పటికీ చేస్తుంటారు. వీరికి 16 ఏ ళ్ల బాలిక క్రిషా ఉంది. ఆమె ఇప్పుడు ఈ కఠినమైన ఆచారాన్ని పాటించి..విజయం సాధించింది. ఒక రోజు రెండు రోజుల కాదూ.. 110 రోజులు పాటు ఉపావాసం చేసింది. అంటే సుమారు 3 నెలల 20 రోజుల పాటు చేసింది. ఈ విషయాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.

జూన్ 11న క్రిషా ఈ ఉపవాస దీక్షను చేపట్టింది. ఉపవాసం ప్రారంభించడానికి అనుమతి కోసం గురువును సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత నెల రోజులు అనుకోగా..అనగా జులై 10 వరకు ఉపవాస దీక్ష చేపట్టగా.. దాన్ని మూడు నెలల 20 రోజులకు పొడిగించింది. శనివారంతో దీక్ష ముగిసింది. ఇన్ని రోజులు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేదు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల మధ్య కేవలం కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగేది. అయితే ఆమె గతంలో కూడా కఠినమైన ఉపవాసం చేసిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తన 9 ఏళ్ల వయస్సులో కూడా.. 8 రోజుల ఉపవాసం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్రిషా కందివాలిలోని కేఈఎస్ కాలేజీలో 11వ తరగతి చదువుతోంది. ఓ బాలిక ఇంత కాలం ఉపవాసం చేయడం పట్ల జైన గురువులు ఆమెను కొనియాడుతున్నారు.