iDreamPost
android-app
ios-app

మహిళా అదృశ్యం.. కొండచిలువ కడుపులో మృతదేహం

  • Published Jun 10, 2024 | 4:59 PMUpdated Jun 10, 2024 | 4:59 PM

అటవి ప్రాంతానికి దగ్గరగా నివసిస్తున్న ఓ వివాహిత తాజాగా అడవిలోకి వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందితో అడవిలోకి వెళ్లి వెతకగా.. అక్కడ ఊహించని షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.

అటవి ప్రాంతానికి దగ్గరగా నివసిస్తున్న ఓ వివాహిత తాజాగా అడవిలోకి వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందితో అడవిలోకి వెళ్లి వెతకగా.. అక్కడ ఊహించని షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.

  • Published Jun 10, 2024 | 4:59 PMUpdated Jun 10, 2024 | 4:59 PM
మహిళా అదృశ్యం.. కొండచిలువ కడుపులో మృతదేహం

సాధారణంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో ఎప్పుడు ఎదో ఒక విషాదం నెలకొంటునే ఉంటుంది. ఎందుకంటే.. ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు.. మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి పొంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. పైగా అప్పటి వరకు కుటంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపిన వారు సైతం మరో క్షణంలో విగతజీవులుగా కనిపిస్తుంటారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే.. ఈ అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. ఎందుకంటే.. ఇక్కడ రకరకాల కృర మృగాలు, భారీ సర్పాలు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటాయి. ముఖ్యంగా ఏ క్షణం ఏ జంతువు ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అడవిలోకి వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందితో వెతకగా అక్కడ ఊహించని షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఇండోనేషియాలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత అడవిలోకి వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందితో అడవిలోకి వెళ్లి వెతకగా.. అక్కడ ఆ మహిళ కొండచిలువకు ఆహారంగా మారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ భయంకరమైన ఘటన దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. అయితే స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఫరీదా అనే 45 ఏళ్ల వివాహితకు నలుగురు పిల్లలు భర్తతో అటవి ప్రాంతానిక దగ్గర నివసిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఫరీదా మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో.. మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు చూసి షాక్ అయ్యారు. అనంతరం ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ ఉబ్బెత్తుగా మారిన ఉదర భాగంతో కదలలేకుండా కనిపించింది.

దీంతో అనుమానం వచ్చి వారంతా దాని పొట్ట చీల్చి చూడగానే దానిలో ఆ మహిళ తలభాగం బయటపడింది. ఇక మహిళ ఒంటిపై దుస్తులు కూడా యథాతథంగా ఆ ప్రాంతంలో కనిపించాయి. దీంతో కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి మహిళ భర్త, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఇలాంటి ఘటనలు ఇండోనేషియాలో తరుచు జరుగుతుంటాయని స్థానికలు చెబుతున్నారు. కాగా, గతేడాది ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి చంపేశారని, అలాగే 2018లో ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. కొన్ని రోజుల తరువాత ఆమె మృతదేహాన్ని కొండచిలువ కడుపులో గుర్తించారని స్థానికులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి