iDreamPost
iDreamPost
నటుడు దర్శకుడు రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా 101 జిల్లాల అందగాడు. సీనియర్ నటులు నూతన్ ప్రసాద్ కు శాశ్వతంగా స్థిరపడిపోయిన ఈ బిరుదుని టైటిల్ గా పెట్టుకోవడంలోనే యూనిట్ ఆసక్తి రేపింది. ఎందరో మగాళ్లు బాధపడే బట్టతలను కాన్సెప్ట్ గా తీసుకుని దీన్ని రూపొందించినట్టు ట్రైలర్ పోస్టర్లలోనే క్లారిటీ ఇచ్చేశారు. చిలసౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు దర్శకుడు రాచకొండ విద్యాసాగర్. క్రిష్ సమర్పించిన ఈ మూవీ ఇవాళే థియేటర్లలో అడుగుపెట్టింది. రిపోర్ట్ లో ఇదెలా ఉందో ఓ లుక్ వేద్దాం.
రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేసే జిఎస్ఎన్(అవసరాల శ్రీనివాస్)తన సహోద్యోగిని అంజలి(రుహని శర్మ)ని ప్రేమిస్తాడు. ఇద్దరి మధ్య బంధం బాగా బలపడుతున్న సమయంలో అప్పటిదాకా విగ్గుతో కాపాడుకుంటూ వచ్చిన జిఎస్ఎన్ బట్టతల రహస్యం బయటపడుతుంది. దాంతో వాళ్ళిద్దరి రిలేషన్ షిప్ ఇరకాటంలో పడుతుంది. ఆత్మనూన్యతను దాచుకుంటూ వచ్చిన జిఎస్ఎన్ కు కొత్త సమస్యలు వచ్చి పడతాయి. మరి ఇతగాడు దీన్నుంచి ఎలా బయట పడ్డాడు అనేదే స్టోరీ. లీడ్ రోల్ చేసిన అవసరాల శ్రీనివాస్ పాత్ర అవసరానికి తగట్టు అందులో చక్కగా ఒదిగిపోయాడు. రుహని శర్మకు ఎక్కువ కాదు కానీ ఉన్నంతలో పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కింది.
సీనియర్ నటి రోషిణి ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు. ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకున్నప్పుడు ఎంటర్ టైన్మెంట్ ప్లస్ ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే థియేటర్ దాకా దీని కోసం రావడానికి ప్రేక్షకుడికి సరైన కారణం ఉండదు. ఈ విషయంలో 101 జిల్లాల అందగాడు జస్ట్ ఓకే అనిపించుకుంటుంది. కొన్ని సన్నివేశాలు నవ్వు పుట్టించేలా ఉన్నప్పటికీ ఈ కామెడీ ఒకే టెంపోలో నడవలేదు. దానికి తోడు ప్రీ ఇంటర్వెల్ దాకా కథ నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా మటుకు భారంగానే సాగుతుంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సోసోనే. పెద్దతెరపై వారానికో సినిమా చూస్తే కానీ నిమ్మళంగా ఉండలేం అనుకుంటే తప్ప మరీ ఎక్కువ ఆశించేందుకు కానీ ఆనందించేందుకు కానీ 101 జిల్లాల అందగాడు ఆఫర్ చేసింది కొంతే
Also Read : డియర్ మేఘా రిపోర్ట్