Telugu News / news / 10 Major Incidents In Agnipath Protests
అగ్నిపథ్ నిరసనలు – 10 కీలక అంశాలు
Follow Us
|
Follow Us
సినిమా వార్తలు
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం పలు రాష్ట్రాల్లో ఘర్షణలకు దారితీసింది. ఆగ్రహావేశాలతో ఉన్న కొంతమంది యువత రైళ్ళకు నిప్పుపెట్టడమే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ఈ గొడవల్లో ఒకరు మరణించగా, కొంతమంది గాయపడ్డారు.
అగ్నిపథ్ ఆందోళనలో 10 కీలక విషయాలు మీకోసం:
త్రిదళాల్లో సైనికుల నియామకానికి ఈ పథకం కొత్త మార్పును తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలోని సికింద్రాబాదులో 19ఏళ్ళ యువకుడు బుల్లెట్ తగిలి మృతి చెందాడు. మరో 15 మంది వరకు గాయపడ్డారు. బిహార్, పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పథకంపై హింసాత్మక సంఘనటలు చోటుచేసుకున్నాయి.
బిహార్ లో ఉప ముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై దాడి జరిగింది. ఇలాంటి సంఘనటలు సమాజానికి మంచిది కాదని ఆమె విచారం వ్యక్తం చేశారు.
బిహార్ లోని దాదాపు 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఘర్షణలు మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా రైల్వే స్టేషన్లోకి అల్లరిమూకలు రైలు బోగీకి నిప్పంటించడమే కాకుండా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వారాణసి, ఫిరోజాబాద్, అమేఠీ వంటి ప్రాంతాల్లోనూ నిరసనలు జరిగాయి. ప్రభుత్వ బస్సులు, ఆస్తలుకు నష్టం కలిగింది. అలీగఢ్ లో లోకల్ బిజెపి నాయకుడి కారు తగలబెట్టారు.
దేశవ్యాప్తంగా ఉన్న నిరసనలతో 214 రైళ్లనురద్దు చేశారు. 11 రైళ్ళను దారి మళ్ళించగా, 90 రైళ్ళు గమ్యస్థానాలకు చేరుకోలేదు. మొత్తంగా 12 రైళ్ళకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. వీటి వల్ల 300 రైళ్ళపై ప్రభావం పడినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
హింసాత్మకఘటనలకు పాల్పడవద్దని, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ యువతకు విజ్ఞప్తి చేశారు. రైల్వేలు దేశం యొక్క ఆస్తిగా పేర్కొన్నారు.
ముందస్తుగా విడుదల చేసిన వారికి పెన్షన్లు లేకపోవడం, సేవా వ్వవధి, 17.5 నుంచి 21 సంవత్సరాల వయోపరిమితి వంటి అంశాలు ఆందోళనకారుల్లో అసంతృత్తిని రగిల్చాయి.
తాజా నిరసనలతో అగ్నిపథ్ వయోపరిమితిని 21 నుంచి 23కు పెంచింది కేంద్రం. ఈ పథకంపై 10 పాయింట్ల సమాచారాన్ని అందిస్తూ నియామకాలపై హామీతో కూడిన స్పష్టతనిచ్చింది.
అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి. అగ్నిపథ్ తో యవత సహనానికి అగ్నిపరీక్ష పెట్టొద్దని కోరారు. అనేక రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.