iDreamPost
iDreamPost
ముందుగా ప్రకటించినట్లుగానే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్గా నియమితులయ్యారు.
జూన్ 27న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు, కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ నియామకాన్ని ఆమోదించిందని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. జూన్ 27న ఆకాష్ అంబానీ తండ్రి రాజీనామా చేయడంతో ఆయన నియామకం జరిగిందని తెలిపింది.
కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఆకాష్ అంబానీ ఇప్పటికే రిలయన్స్ జియో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా కంపెనీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020లో మెగా డివెస్ట్మెంట్ సమయంలో, ఇషా అంబానీతో పాటు, ఆకాష్ లతో కలసి, గూగుల్, ఫేస్బుక్, జనరల్ అట్లాంటిక్ , సౌదీ అరేబియాకు చెందిన సావరిన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF)లు రిలయన్స్ రిటైల్ , డిజిటల్ యూనిట్లలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఆ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు.