iDreamPost
android-app
ios-app

రైళ్ల పట్టాలపై ఈ పనులు చేస్తే..ఇకపై నేరుగా జైలుకే!

Railway Protection Force: రైళ్లు నడుస్తున్న సమయాల్లో కొందరు ఆకతాయిలు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులు చేసే వారికి రైల్వే శాఖ గట్టి షాకిచ్చింది. ఇకపై ఆ పనులు చేస్తే..నేరుగా జైలుకే అంటూ హెచ్చరికలుజారీ చేసింది.

Railway Protection Force: రైళ్లు నడుస్తున్న సమయాల్లో కొందరు ఆకతాయిలు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులు చేసే వారికి రైల్వే శాఖ గట్టి షాకిచ్చింది. ఇకపై ఆ పనులు చేస్తే..నేరుగా జైలుకే అంటూ హెచ్చరికలుజారీ చేసింది.

రైళ్ల పట్టాలపై ఈ పనులు చేస్తే..ఇకపై నేరుగా జైలుకే!

నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరింది. ఈ క్రమంలో చాలా మంది రీల్స్, వీడియోలు చేస్తూ.. నెట్టింట్లో పోస్టు చేస్తుంటారు. అలానే ఎంతో మంది తమ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి..ఫేమస్ అయ్యారు. ఇంకా చాలా మంది గుర్తింపు పొందేందుకు అనేక వెరైటీ వీడియోలు తీస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాకరమైన పనలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా కొందరు రైల్వేట్రాకులపై రాళ్లు, ఇతర పెద్ద పెద్ద వస్తువులు పెట్టి..రైలు ప్రమాదాలకు కారణం అవుతుంటారు. ఇలాంటి వారి విషయంలో తాజాగా రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అలాంటి పనులు చేసే వారు నేరుగా జైలుకు వెళ్లనున్నారు. మరి..పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రైళ్లు నడుస్తున్న సమయాల్లో కొందరు ఆకతాయిలు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు పట్టాలపై రూపాయి కాయిన్లు పెడుతుంటే, మరికొందరు సైకిళ్లు, బండలు, ఇనుపకడ్డీలు వంటి ఏవేవో వస్తువులను పట్టాలపై పెడుతూ తుంటరి పనులు చేస్తుంటారు. తాము ఇలాంటి పనులు చేసినా రైళ్లు ఆగే పరిస్థితి ఉండదని, తమను ఎవరూ ఏమీ చేయరనే ధైర్యంతో రెచ్చిపోతుంటారు. ఇలా వారి తుంటరి పనులతో రైలు పట్టాలు, రైళ్ల భద్రతకు కొందరు వ్యక్తులు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) అప్రమత్తమైంది.

If you do these things on the train tracks, you will go straight to jail!

ఇకపై ఎవరైన రైలు పట్టాలపై వస్తువులు పెట్టి, తుంటరి పనులు చేస్తే..వారిని నేరుగా జైలుకు పంపాలను ఆర్పీఎఫ్ డీజీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలే ఓ యువకుడిని తాజాగా అరెస్టు జైల్లో పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు.. యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహించేవాడు. తాను ఫేమస్ అయ్యేందు, తన వీడియోలు వైరల్ అయ్యేందుకు పట్టాలపై రాళ్లు, గ్యాస్ సిలిండర్లతోపాటు సైకిళ్లును పెట్టే వాడు. అంతేకాక బతికున్న జంతువులను పెట్టి వీడియోలు చేసేవాడు.  అంతేకాక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. ఇక తనను ఎవరు పట్టుకుంటారులే అనే ధైర్యంతో ఇలాంటి చర్యలకు పాల్పడిన ఆ యువకుడికి పోలీసులు గట్టి షాకిచ్చారు. ఈ ఘటనపై నెటిజన్లు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ యువకుడిపై ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు.. నిందితుడి కోసం గాలించి.. చివరకు అరెస్టు చేశారు. ఈ క్రమంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ డీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను ఆదేశించారు. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు ఎక్కడ కనిపించినా 139 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు  తుంటరి పనులు చేస్తూ..రైల్వే ప్రయాణానికి అంతరాయం కలిగిస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే..జైలుకు వెళ్తారు.