iDreamPost
android-app
ios-app

వీడియో: ఆకతాయిల ఆగడాలు.. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిని చున్నీ లాగి..

వీడియో: ఆకతాయిల ఆగడాలు.. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిని చున్నీ లాగి..

దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా అల్లరిమూకలలో మార్పు రావడం లేదు. యువతులను వేధిస్తూ వారి ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఓ రాష్ట్రంలో ఓ ఆకతాయి చేసిన పనికి ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కాలేజీ ముగిసిన తర్వాత స్నేహితురాలితో కలిసి సైకిల్ పై వస్తున్న ఆమెను మార్గమధ్యలో బైక్ పై వెంబడించిన ఆకతాయిలు ఆమె చున్నీ లాగారు. దీంతో ఆమె సైకిల్ అదుపు తప్పికిందపడిపోయింది. ఆ సమయంలో వెనకు నుంచి వస్తున్న బైక్ తో పాటు ముందు నుంచి వచ్చిన బైక్ ఆ విద్యార్థినిని ఢీకొట్టాయి. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

ఉత్తర్ ప్రదేశ్ లో ఆకతాయిలు ఘోరానికి పాల్పడ్డారు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థిని చున్నీ లాగి ఆమె మృతికి కారణమయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వారాహి గ్రామానికి చెందిన నైన్సీ పటేల్ అనే విద్యార్థిని స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కాలేజీకి వెళ్లిన నైన్సీ కాలేజీ ముగిసిన తర్వాత తన ఫ్రెండ్ తో కలిసి సైకిల్ పై ఇంటికి బయలుదేరింది. అలా వస్తున్న సమయంలో అల్లరిమూకలు బైక్ పై వచ్చి వారిని వెంబడించారు. ఓ బైక్ పై ఉన్న ఆకతాయి నైన్సీ చున్నీ లాగాడు. దీంతో ఒక్కసారిగా సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది.

అదే సమయంలో వెనక నుంచి వస్తున్న బైక్ తో పాటు ముందు నుంచి వస్తున్న బైక్ ఆమెను బలంగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో నైన్సీ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ నైన్సీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీల్లో రికార్డయ్యింది. కూతురు మరణంతో బోరున విలపించిన నైన్సీ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆకతాయిలు వేధించి తమ కూతురు ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ ఘోరానికి కారణమైన నిందితులైన షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.