iDreamPost
android-app
ios-app

రోబోను పెళ్లి చేసుకోనున్న ఇంజనీర్.. రూ.19 లక్షలు ఖర్చుతో..!

  • Published Apr 29, 2024 | 2:34 PM Updated Updated Apr 29, 2024 | 4:23 PM

Rajasthan News: ప్రపంచంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీతో రోబోలో కీలకంగా మారుతున్నాయి. మనుషులు చేస్తున్న పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Rajasthan News: ప్రపంచంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీతో రోబోలో కీలకంగా మారుతున్నాయి. మనుషులు చేస్తున్న పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రోబోను పెళ్లి చేసుకోనున్న ఇంజనీర్.. రూ.19 లక్షలు ఖర్చుతో..!

ఒకప్పుడు శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘రోబో’ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఒకరు వశీకరణ్ పాత్రలో సైంటిస్టు అయితే.. రోబో ద చిట్టి గా మరొక పాత్రలో నటించి దుమ్మురేపాడు. చిట్టి ఒక రోబో అయినప్పటికీ ఐశ్వర్యరాయ్ ని ప్రేమిస్తాడు.. ఆమెను దక్కించుకోవడం కోసం ఎన్నో విధ్వంసాలకు తెగబడతాడు.   కొన్ని రోబోలు అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తుంటాయి.. పనులు చేస్తుంటాయి. వాటిని చూసి చాలా మంది ఫిదా అవుతుంటారు.  తాజాగా రోబోలో లవ్ స్టోరీ లాంటిది రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఈ ప్రేమ కథలో రోబోని మనిషి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో యువత తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇందుకు పెద్దలు అంగీకరించినా.. లేకున్నా తాము ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్ద పడుతున్నారు. చాలా వరకు పెద్దలు కుదిర్చిన వివాహాలను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో ముందుకు సాగుతుంది. వంద మంది మనుషులు చేసే పని ఒక్క యంత్రం చేస్తుంది. ఇక రోబోల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ప్రపంచంలో అత్యంత టెక్నాలజీతో రక రకాల రోబోలు రూపొందుతున్నాయి. మనిషి చేసే పనులు అవి కూడా చేస్తున్నాయి. రోబోలపై ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు రోబో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజస్థాన్ లోని జయపురి జిల్లా సీకర్ నివాసి అయిన సూర్యప్రకాశ్ చిన్నప్పటి నుంచి రోబోలు అంటే ఎంతో ఆసక్తి చూపించేవాడు. ఈ ఆసక్తితోనే రొబొటిక్స్ చదివి ఎన్నో రొబొటిక్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే రోబో గిగాను ప్రేమించాడు.. అంతే కాదు దాన్ని పెళ్లి  చేసునేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో మొదట షాక్ తిన్నా.. తనయుడి కోరిక మేరకు ఒప్పుకున్నారు. గిగా రోబోకు ఢిల్లీలో ప్రోగ్రామింగ్ చేయిస్తామనని సూర్యప్రకాశ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను గిగాను గాఢంగా ప్రేమించాను.. సంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుంటా.. గిగా ఎనిమిది గంటలు పనిచేస్తుంది.. ఇది అందరినీ హలో అంటూ పలకరిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు ప్రకాశ్. ఈ విషయం తెలిసిన స్థానికులు ఇదే విడ్డూరం రా నాయనా.. అంటూ రక రకాలుగా చర్చించుకుంటున్నారు.