P Venkatesh
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్తను అందించింది. ఏకంగా రూ. 5 లక్షలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఉచితంగానే మీరు రూ. 5 లక్షలు పొందొచ్చు. ఎలా పొందొచ్చంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్తను అందించింది. ఏకంగా రూ. 5 లక్షలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఉచితంగానే మీరు రూ. 5 లక్షలు పొందొచ్చు. ఎలా పొందొచ్చంటే?
P Venkatesh
కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా రూ. 5 లక్షలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. మీరు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రూ. 5 లక్షలు పొందొచ్చు. ఇంతకీ ఆ కేంద్ర ప్రభుత్వ పథకం ఏంటి? రూ. 5 లక్షలు పొందాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? ఇటీవల కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పలు అంశాలపై క్విజ్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. అందులో గెలుపొందిన వారికి భారీగా ప్రైజ్ మనీని అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా క్విజ్ లో పాల్గొనడమే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద క్విజ్ నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి రూ. 5 లక్షలు అందించనుంది.
కొందరు ఆన్ లైన్ గేమ్స్ ఆడి చిక్కుల్లో పడుతుంటారు. ఈ సమయంలో డబ్బులు పోగొట్టుకుని తీవ్రంగా నష్టపోతుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆన్ లైన్ క్విజ్ ద్వారా ఏ విధమైన నష్టం లేకుండా నగదు గెలుచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం.. భారత ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద సర్దార్ యూనిటీ ట్రినిటీ క్విజ్‌ని ప్రారంభించింది. ఆయన జీవితానికి సంబంధించిన అంశాలతో ఈ క్విజ్ ఉంటుంది. ఈ క్విజ్ ఇంగ్లీష్, హిందీతోపాటూ పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఈ క్విజ్‌ని కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2024న ప్రారంభించింది. జనవరి 31, 2024 రాత్రి 11.30కి ఈ క్విజ్ ముగుస్తుంది.
ఇందులో భారతీయులంతా పాల్గొనవచ్చు. ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో 10 ప్రశ్నలుంటాయి. ప్రతీ ప్రశ్నకూ 4 సమాధానాలు ఉంటాయి. వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఈ క్విజ్ 200 సెకండ్ల (3 నిమిషాల 20 సెకండ్లు)లో ముగుస్తుంది. ఈ క్విజ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://www.mygov.in/ లో పొందవచ్చు. క్విజ్ లో పాల్గొనదలిచిన వారు కేంద్రం అధికారిక వెబ్‌సైట్ https://quiz.mygov.in/లో రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఇతర వివరాలతో అకౌంట్ క్రియేట్ చేసుకోని లాగిన్ కావాలి.
లాగిన్ అయిన తర్వాత స్టార్ట్ క్విజ్ బటన్ పై క్లిక్ చెయ్యాలి. అక్కడ మీకు కావాల్సిన భాషను ఎంచుకుని క్విజ్ ప్రారంభించాలి. ఈ క్విజ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలపై 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్న 20 సెకండ్లలో ముగుస్తుంది. కాబట్టి వేగంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు.
ఇక ఈ క్విజ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గెలిచిన వారికి రూ.5,00,000 ప్రైజ్ మనీ అందిస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.3,00,000 ఇస్తారు. మూడో స్థానం సొంతం చేసుకున్న వారికి రూ.2,00,000 ఇస్తారు. ఆ తర్వాత ప్రతిభ కనబర్చిన 100 మందికి ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కేంద్ర అధికారిక వెబ్ సైట్ మై గావ్ ను సందర్శించి క్విజ్ లో పాల్గొని రూ. 5 లక్షలు గెలుచుకోండి.