ప్రేమలో విఫలమవుతున్నారా? అయితే.. లవర్‌ను అద్దెకు తీసుకోండి!

అది వన్‌ సైడ్‌ కావచ్చు.. టూ సైడ్స్‌ కావచ్చు.. నూటికి 90 శాతం ప్రేమలు విఫలమవుతుంటాయి. టూ సైడ్‌ ప్రేమలు విఫలం అవ్వటానికి అసంతృప్తే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనకు నచ్చినట్లుగా లేనపుడు.. ప్రవర్తించనపుడే అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో… వీళ్లు మనల్ని అర్థం చేసుకోవటం లేదే అన్న బాధ కలుగుతుంది. ఆ బాధే తర్వాతి కాలంలో తీవ్ర అసంతృప్తిగా మారి బ్రేకప్‌కు దారి తీస్తుంది. ఇక, వన్‌సైడ్‌ లవ్‌లు మరీ దారుణం. సిన్సియర్‌గా ప్రేమించినపుడు అవతలి వ్యక్తి నో అంటే.. భగ్న ప్రేమికులుగా మారిపోవాల్సి వస్తుంది.

వన్‌ సైడ్‌ లవ్‌ కావచ్చు.. టూ సైడ్‌ లవ్‌ కావచ్చు.. విఫలం అయినపుడు బాధ తప్పదు. అందుకే.. జపాన్‌లో ఓ కొత్త పద్దతికి తెర తీశాయి కొన్ని కంపెనీలు. మీరు అక్కడ లవర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా గంటల లెక్కన అద్దెకు తీసుకోవచ్చు. వారితో మీ ప్రేమను పంచుకోవచ్చు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని కొన్ని కంపెనీలు.. అద్దెకు ప్రేమికులు అనే కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చాయి. ఎవరైతే తమకు లవర్‌ కావాలనుకుంటున్నారో.. వారు గంటల ప్రకారం అద్దెకు తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా లవర్‌ను అద్దెకు తీసుకోవచ్చు.

గంటకు 3 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జపాన్‌ వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అమ్మాయిల్ని అద్దెకు తీసుకోవాలంటే కొన్ని రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ అమ్మాయిల్ని నేరుగా కలవటానికి ఉండదు. అంతేకాదు! సదరు అమ్మాయిలు టిప్పులు కానీ, ఖరీదైన బహుమతులు కానీ తీసుకోరు. జపాన్‌లో ఇలాంటి సర్వ సాధారణం కొన్ని కంపెనీలు.. కుటుంబసభ్యుల్ని కూడా అద్దెకు ఇస్తున్నాయి. మరి, జపాన్‌లో లవర్స్‌ను అద్దెకు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments