iDreamPost
android-app
ios-app

కాళ్లకు సంకెళ్లతో నదిలో కొట్టుకొచ్చిన మహిళ..! ఎలా బయటపడిందంటే..

Woman With Ankles Tied: రెండు రోజుల్ల క్రితం వచ్చిన ఓ వార్త అందరిని షాకి గురి చేసింది. అడవిలో చెట్టుకు సంకేళ్లతో ఓ మహిళను బంధించారు. ఈ ఉదంతం మర్చిపోక ముందే.. ఓ మహిళ కాళ్లకు సంకెళ్లతో నదిలో కొట్టుకొచ్చింది. చివరకు సినిమాలకు మించిన ట్విస్ట్ తో బయటపడింది.

Woman With Ankles Tied: రెండు రోజుల్ల క్రితం వచ్చిన ఓ వార్త అందరిని షాకి గురి చేసింది. అడవిలో చెట్టుకు సంకేళ్లతో ఓ మహిళను బంధించారు. ఈ ఉదంతం మర్చిపోక ముందే.. ఓ మహిళ కాళ్లకు సంకెళ్లతో నదిలో కొట్టుకొచ్చింది. చివరకు సినిమాలకు మించిన ట్విస్ట్ తో బయటపడింది.

కాళ్లకు సంకెళ్లతో నదిలో కొట్టుకొచ్చిన మహిళ..! ఎలా బయటపడిందంటే..

నిత్యం అనేక రకాల ఘటనలు మనకు వివిధ మార్గాల్లో కనిపిస్తుంటాయి. కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. రెండు రోజుల్ల క్రితం వచ్చిన ఓ వార్త అందరిని షాకి గురి చేసింది. అడవిలో చెట్టుకు సంకేళ్లతో ఓ మహిళను బంధించారు. ఈ ఉదంతం మర్చిపోక ముందే..కాళ్లకు గొలులతో కట్టేసిన ఓ మహిళ నదిలో 30 కిలోమీటర్ల మేర ఈడ్చుకొచ్చింది. నదిలో కొట్టుకొస్తున్న సదరు మహిళ అరుపులు విన్న మత్సకారులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘోరమైన ఘటన  ఒడిశాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఒడిశా రాష్ట్రంలో కూడా భయంకరంగా వానలు కురిశాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా పల్సాడ్ ప్రాంతంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. గురువారం ఉదయం మహానదిలో చేపలు వేటసాగిస్తున్న క్రమంలో వారికి ఓ అరుదైన అనుభవం ఎందురైంది. అదే సమయంలో నదిలో కొట్టుకొస్తున్న ఓ మహిళ అరుపులు వారికి వినిపించాయి.

దీంతో వారు వెంటనే నదిలోకి దూకి ఆమెను రక్షించారు. ఒడ్డుకు తీసుకొచ్చిన సమయంలో ఆమెను చూసి షాకయ్యారు. ఆమె కాళ్లకు సంకెళ్లు వేయబడి ఉన్నాయి. చాలా నిస్సాహాయ స్థితిలో ఉంది. ఆమె వెంటనే ఆహారం, నీరు అందించారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ గురించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌గఢ్‌ ప్రాంతానకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ ప్రాంతంలోని పూర్థా గ్రామానికి చెందిన సరోజిని చౌహాన్‌ (33)గా పోలీసులు గుర్తించారు. స్థానిక ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో బంధువులు అలా కాళ్లకు సంకెళ్లు వేసినట్టు పోలీసులకు వెల్లడించారు. అయితే, నదిలో ఆమె ఎలా పడిపోయిందనే విషయం తమకు తెలియదని ఆమె సోదరుడు చెప్పాడు. ఆమెకు ఈత రావడంతోనే దాదాపు 30 కిలోమీటర్లు నదిలో కొట్టుకువచ్చినా కూడా ప్రాణాలను కాపాడుకోగలిందని పోలీసులు తెలిపారు. పరీక్షల అనంతరం కుటుంబసభ్యులకు సరోజిని చౌహన్‌ను అప్పగించినట్లు ఝార్సుగూడ ఎస్పీ పురుషోత్తమ్ దాస్ తెలిపారు. ఇక, 2016లోనూ మహానదిలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. మొత్తంగా ఈ ఘటనలో సినిమాలకు మించిన ట్విస్టుల జరగ్గా.. చివరికి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.