iDreamPost
android-app
ios-app

వీడియో: పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. నెటిజన్లు ఫిదా..

  • Published Oct 09, 2023 | 1:54 PM Updated Updated Oct 09, 2023 | 1:54 PM
వీడియో: పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. నెటిజన్లు ఫిదా..

సాధారణంగా మహిళలు గర్భవతులైత కుటుంబ సభ్యులు సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతుంటారు. స్త్రీ మాతృత్వపు మాధుర్యాన్ని పొందే కొద్ది నెలల ముందు సీమంత వేడుకలు నిర్వహిస్తుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, ముత్తయిదువలు గాజులు, పండ్లు, స్వీట్లు ఇచ్చి పండండి బిడ్డని కనాలని ఆశీర్వదిస్తుంటారు. అయితే ఇటీవల మనుషులకే కాదు.. ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు,  సీమంతం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ తన పెంపుడు కుక్కకు సీమంతం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మనుషులు పెంచుకునే పెంపుడు జంతువుల్లో శునకాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు ప్రేమ, విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో త్వరగా కలిసిపోతుంటాయి. తమ యజమానికి ఏ చిన్న హాని కలగకుండా చూస్తుంటాయి.. అవసరమైన వాటి ప్రాణాలు పణంగా పెడుతుంటాయి. తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలంటే యజమానులకు కూడా వల్లమాలిన అభిమానం. తమ సొంత పిల్లలను చూసుకున్నట్లు చూసుకుంటారు. వాటికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేరు. అవి చనిపోతే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయినంతగా బాధపడతారు.  ఇటీవల తాము ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న కుక్కలకు పుట్టిన రోజు, సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఓ మహిళ తన పెంపుకుడు కక్కకు సీమంతం చేస్తుంది. తివాచీలతో అలంకరించి చెక్క పెట్టె ఎన్ క్లోజర్ గా చేసింది. కుక్కకు తిలకం దిద్ది.. రెండు కాళ్లకు గాజులు వేసింది. తర్వాత పూలు చల్లి.. దానికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించింది. దీనికి సంబంధించిన తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నటిజన్ల హృదయాలు గెల్చుకుంది. ఇంట్లో పెంపుడు జంతువులు విశ్వాసం, ప్రేమను చూరగొంటాయి.. అలాంటి వాటికి యజమానులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Shivam (@rosy_remo_the_retriever_007)