iDreamPost
android-app
ios-app

పరమ శివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి!

  • Published Jul 25, 2023 | 7:53 AM Updated Updated Jul 25, 2023 | 7:53 AM
  • Published Jul 25, 2023 | 7:53 AMUpdated Jul 25, 2023 | 7:53 AM
పరమ శివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి!

ఆ యువతికి దైవ భక్తి ఎక్కువ. పరమ శివుడు అంటే ప్రాణం. క్రమం తప్పకుండా నిత్యం ఆయనకు పూజలు చేసేది. ఆ భక్తి చివరకు ఎంతలా మారిందంటే.. పరమ శివుడ్నే తన భర్తలా ఊహించుకునేంతలా.. ఆ యువతి శివుడ్ని భర్తగా ఊహించుకోవటమే కాదు. పెద్దలను ఒప్పించి ఆయన్ను పెళ్లి కూడా చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లోని ఝూన్సీ జిల్లాకు చెందిన ఓ యువతికి పరమ శివుడంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి శివుడ్నే ఎక్కువగా పూజించేది.

శివుడి మీద ఉన్న భక్తితో బ్రహ్మకుమారీ సమాజంలో కూడా చేరింది. రోజు రోజుకు ఆ యువతికి శివుడి మీద ఇష్టం పెరగసాగింది. ఈ నేపథ్యంలోనే తనకు వస్తున్న పెళ్లి చూపుల్ని కాదంటూ వచ్చింది. చివరకు ధైర్యం చేసి శివుడ్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేసింది. మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కూతురికి శివుడిపై ఉన్న ఇష్టాన్ని కాదనలేక పెళ్లికి సరేనన్నారు. దాదాపు నెల రోజులనుంచి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఆ యువతి ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

మనిషితో పెళ్లి జరిగితే ఎలా చేస్తారో అచ్చం అలానే అంగరంగ వైభంగా ఈ పెళ్లి జరిగింది. యువతి శివ లింగం మెడలో వరమాల వేసి ఆయనను భర్తగా స్వీకరించింది. ఈ పెళ్లి వేడుకను చూడ్డానికి చుట్ట పక్కల ఊర్లనుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. యువతి శివుడ్ని పెళ్లి చేసుకునే దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. మరి, సదరు యువతి శివుడ్ని పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio