Arjun Suravaram
Arjun Suravaram
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన ఘట్టం. అందుకే యువత తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని భావిస్తుంది. అలానే ఎవరైనా.. తమ జీవితంలో ఒక వ్యక్తిని ఒక్కేసారి పెళ్లి చేసుకుంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండి ఉంటే..షష్టి పూర్తికి మరోసారి వివాహం జరుపుకుంటారు. కానీ ఓ మహిళ… తన భర్తను 19 ఏళ్ల తరువాత మరోసారి పెళ్లి చేసుకుంది. బిడ్డలే వారికి దగ్గరుండి వివాహం జరిపించారు. మరి.. ఎందుకు ఆ మహిళ.. తన భర్తనే మరోసారి వివాహం చేసుకుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒడిశాలోని కటక్ జిల్లాలో భబ్‌చంద్‌పుర్ గ్రామానికి చెందిన బసంత్ పరిదా, ఊర్మిళ పరిదా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలానే బిడ్డలను చదివిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. 2004లో ఒక సారి తన మేనల్లుడి ఇంటికి వెళ్తానని ఊర్మిళ ఇంటి నుంచి బయలుదేరింది. ఆమెకు అప్పుడప్పుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. అలానే ఇంటి నుంచి బయటకు వెల్లిన ఊర్మిళ మతిస్థిమితం కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్లే మార్గం మరిచిపోయింది. అలా ఆమె దారి తప్పి ఎటో వెళ్లిపోయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నం చేశారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా కూడా ఫలితం లేకుండా పోయింది. అలా దాదాపు 19 ఏళ్ల గడిచిపోయింది.
ఊర్మిళ మీద అందరు ఆశలు వదిలేసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల తిగిరా పట్టణంలోని ఓ ఏటీఎం వద్ద నిస్సహాయ స్థితిలో ఊర్మిళ ఉంది. ఆమెను ఓచూసిన ఓ వ్యక్తి వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన జిల్లా కలెక్టర్ చొరవతో ఊర్మిళ.. శ్రీ మందిర్ సేవాశ్రమానికి చేరింది. నెలన్నరపాటు ఆశ్రమంలో చికిత్స అందించాక కోలుకొన్న ఊర్మిళకు తన గతం గుర్తుకు వచ్చింది. చివరకు. గత సోమవారం తిరిగి ఇంటికి వచ్చిన ఊర్మిళను నుదుట బొట్టు పెట్టి, పూలమాల వేసి భర్త బసంత్ స్వాగతించాడు. ఈ క్రమంలో వారి బిడ్డలు అమ్మనాన్నలకు మరోసారి పెళ్లి చేశారు. ఈఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.