కేరళ వరదల్లో విషాదం.. వరద ఇంట్లోకి వచ్చేస్తోంది! కాపాడండి అంటూ లాస్ట్ కాల్!

Kerala Floods 2024: కేరళ రాష్ట్రంలో వరదలు విలయం సృష్టించిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గల్లంతయ్యారు. ఇక ఈ విపత్తుల్లో ఎక్కడ చూసిన విషాద ఘటనలే కనిపిస్తున్నాయి. తాజాగా తమను కాపాడంటూ ఓ మహిళ చేసిన చివరి కాల్ అందరిని కన్నీరు పెట్టిస్తుంది.

Kerala Floods 2024: కేరళ రాష్ట్రంలో వరదలు విలయం సృష్టించిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గల్లంతయ్యారు. ఇక ఈ విపత్తుల్లో ఎక్కడ చూసిన విషాద ఘటనలే కనిపిస్తున్నాయి. తాజాగా తమను కాపాడంటూ ఓ మహిళ చేసిన చివరి కాల్ అందరిని కన్నీరు పెట్టిస్తుంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఘటన కేరళ వరదలు. ప్రకృతి ఆ రాష్ట్రంపై కన్నెర్ర చేసినట్లుగా విజృంభించింది. గ్రీన్ స్టేట్ గా పేరొందిన కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలకు అల్లకల్లోలంగా మారింది. ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి..పెను విషాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో చాలా ప్రదేశాల్లో భారీ విలయం సంభవించింది. ఇక ఈ ప్రళయంలో దాదాపు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలానే వందల మంది వరదల్లో తప్పిపోయారు. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని సంఘటనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఓ మహిళ తమను కాపాడంటూ చేసిన చివరి కాల్ కన్నీరు పెట్టిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళలో 2018లో సంభవించిన వరదలు భారీ వినాశనాన్ని సృష్టించాయి. నాటి వరదల్లో దాదాపు 483 మంది మృతి చెందారు. అయితే ఈ సారి దానికి మించిన విలయం సంభవించింది. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు నదిలో కొట్టుకుపోగా, మరెందరో కొండచరియల బండల కింద ఇరుక్కున్నారు. వరదలు ప్రమాదకర స్థాయికి చేరక ముంద నీతు జోజో అనే మహిళ తాను పని చేస్తున్న మెడికల్ కాలేజి వాళ్లకు ఫోన్ చేసింది. తాము మునిగిపోతున్నామని, వచ్చి కాపాడంటూ వారిని వేడుకుంది.

వయనాడ్ ప్రాంతంలోని మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో నీతు ఉద్యోగం చేస్తుంది. ఇది మంగళవారం తెల్లవారుజామున సరిగ్గా ఒంటి గంట సమయంలో వారింటికి సమీపంలోకి వరద నీరు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన నీతు తన భర్త జోజో వి జోసెఫ్‌ను నిద్ర లేపారు. వారు చూస్తుండగానే వారి చుట్టు పక్కలా ప్రాంతాల కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే వారి ఇంటికి కూడా సమీపంలోకి వరద నీరు వస్తుంది. ఇదే సమయంలో ఆమె తాను విధులు నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీకి ఫోన్ చేసింది. చూరల్‌మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని, ఆమె ఇంట్లో నీరు నిండి ఉందని, ఎవరైనా వచ్చి తమను రక్షించమని నీతు కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది.

మళ్లీ కాసేపటి తరువాత మరోసారి ఫోన్ చేసి..వారి ఇంటిని నీరు చుట్టు ముట్టాయని త్వరగా కాపాడండి అని చెప్పింది. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు జోజో ఫ్రెండ్స్ చూరల్ మల ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వారికి ఇంటికి చేరుకునే మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో అక్కడికి చేరుకోలేకపోయారు. ఇక కాసేపటికి వరద నీరు చుట్టు ముట్టి నీతు గల్లంతైంది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు మాత్రం క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ మహిళ..కాపాడంటూ చేసిన చివరకి కాల్ కన్నీరు తెప్పిస్తుంది. మరి.. కేరళలో జరిగిన ఈ ప్రకృతి ప్రళయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments