iDreamPost

వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై మహిళ కిడ్నాప్.. ఈడ్చుకుంటూ!

Pune: తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోరాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ మహిళను పట్టపగలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి..కారులో తీసుకెళ్లారు. ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Pune: తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోరాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ మహిళను పట్టపగలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి..కారులో తీసుకెళ్లారు. ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై మహిళ కిడ్నాప్.. ఈడ్చుకుంటూ!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో వివిధ రకాల నేరాలు చోటుచేసుకుంటాయి. రెండు రోజుల క్రితం హైదారాబాద్ నగరంలో ఓ బంగారు షాపులో పట్టపగలే ఇద్దరు దుండగులు వచ్చి..కత్తులతో బెదరించారు. ఎదురుతిరిగిన యాజమానిపై కత్తితో దాడి చేశారు. అలానే మరికొన్ని చోట్ల కూడా పట్టపగలే కొందరు దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనం చూశాము. తాజాగా ఓ మహిళను పట్టపగలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి..కారులో తీసుకెళ్లారు. ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలోని పూణే పట్టణంలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ మహిళా దగ్గరకు వెళ్లి..ఆమె మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఈడ్చుకుంటూ కార లో ఎక్కించారు. ఆ తర్వాత ఆ ఆ మహిళతో పాటు కారులో అక్కడి నుంచి పారిపోయారు. పట్టపగలే ఇంత దారుణం జరుగుతున్న గాని.. ఆ  అమ్మాయిని కారులో ఎక్కించే సమయంలో కొందరు చూస్తూనే ఉన్నారు. అయితే ఎవరు కూడా ఆమె ప్రయత్నం, కనీసం ఈ ఘటనపై కూడా స్పందించలేకపోయారు. ఇక ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న హోటల్లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యింది.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఆ మహిళను కిడ్నాప్ చేసింది.. ఆమెకు తాళి కట్టిన భర్త, అలానే అత్తమామలే అంట. ప్రింబ్రి – చించివాడ ప్రాంతంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ఉద్యోగం చేస్తోంది. ఇక సదరు మహిళను ఆఫీస్ అయిపోయిన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమె భర్త అత్తమామలు ఆమెకు మత్తిచ్చి లాకెళ్ళారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన ఆ మహిళను సుమిత్ షహనే అనే వ్యక్తి, అతని తల్లిదండ్రులు ఆమె ఈచ్చుకుంటూ లాకెళ్లి కారులో ఎక్కించారు. అనంతరం అక్కడి నుంచి వారందరూ కారులో పారిపోయారు. ఈ క్రమంలోనే కారును ఓ గుడి వద్ద ఆపిన సమయంలో బాధితురాలు పెద్దగా కేకులు వేసింది. అవి విన్న చుట్టుపక్కన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ విషయంపై స్పందించారు. తనకి సంబంధించిన కొన్ని ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టేందుకు వారు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని బాధిత మహిళ పోలీసులకు తెలియజేసింది. కిడ్నప్ కు గురైన మహిళకు 2023లో వివాహం జరగగా.. తర్వాత మూడు నెలలకే ఆ దంపతు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆవిడ అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటుంది. ఇక సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి