Krishna Kowshik
చేతనంత సాయం చేసే కాలం పోయింది. కనీస ఉడత సాయాన్ని చేసేందుకు కూడా కాళ్లు, చేతుళ్లు రావడం లేదు నేటి మానవులకు. గతంలో రోడ్డుపై పడినా, ఇంటికి ఎవరైనా సాయం కోరి వస్తే ఠక్కున స్పందించేవారు. కానీ నేడు స్పందించేంత సమయం కొరవడింది.
చేతనంత సాయం చేసే కాలం పోయింది. కనీస ఉడత సాయాన్ని చేసేందుకు కూడా కాళ్లు, చేతుళ్లు రావడం లేదు నేటి మానవులకు. గతంలో రోడ్డుపై పడినా, ఇంటికి ఎవరైనా సాయం కోరి వస్తే ఠక్కున స్పందించేవారు. కానీ నేడు స్పందించేంత సమయం కొరవడింది.
Krishna Kowshik
మానవత్వం రాను రాను మనుషుల్లో కనుమరుగు అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోతే.. మందు ఎక్కువయ్యి ఉంటదిలే అని కనీసం ఆ మనిషి మొహాన్ని కూడా చూడటం లేదు. ఇక సాయం చేసే నాధుడే కరువయ్యాడు ఈ లోకంలో. క్విట్ ప్రోకో సిద్దాంతాన్ని అవలంభిస్తున్నారు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్న చందంగా మారిపోయిన నేటి మానవుల తీరు. ప్రతిదాన్ని కమర్షియల్‌గా చూస్తుండటంతో మానవతా విలువలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా ఈ గజిబిజీ గందరగోళ ప్రపంచంలో ఏదైనా చేస్తే.. తమ మెడకు చుట్టుకుంటుదని, మళ్లీ దాని కోసం సమయం కేటాయించడం ఎందుకున్న భావనలో రొటీన్ లైఫ్ బతికేస్తున్న మానవ జీవాలెన్నో. అయినప్పటికీ.. కొంత మంది తమ సహృదయాన్ని చాటుతూ ఉంటారు.
నడి రోడ్డుపై ఓ నిండు గర్భిణీ ప్రసవించగా.. కొంత మంది చూస్తూ వెళ్లిపోయారు. మరికొంత మంది ఆమె దీన స్థితిని చూసి చలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయి నగరంలోని కామానీ జంక్షన్ సమీపంలోని వీధిలో సువర్ణ మిర్గాల్ 30 ఏళ్ల గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పురిటి నొప్పులు పడుతుండగా.. ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాగే నొప్పులు పడుతూ కన్నది. అయితే ఆమె స్పృహ కోల్పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లీ బిడ్డలను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని పోలీసు అధికారి నిర్భయ్ పాఠక్ తెలిపారు.
అయితే ఆ మహిళ గర్భం దాల్చడానికి కారకులు ఎవరన్న విషయంపై పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే ఇటీవల ముంబయిలోని పలు ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై ఎవరన్నా అత్యాచారానికి ఒడిగట్టారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే శిక్షణ పొందిన పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. ప్రతి రోజు పెట్రోలింగ్ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.