iDreamPost
android-app
ios-app

మగాళ్లపై తప్పుడు కేసులు పెట్టే ఆడవాళ్లు ఇక జైలుకే! ఈ కేసు ఉదాహరణ!

కూతురు ఓ అబ్బాయిని ప్రేమించిందని తల్లికి తెలిసింది. అతడిని లవ్ చేయడం ఇష్టపడని తల్లి.. కూతురిపై ఎటువంటి నింద వేయకూడదో వేసింది. చివరకు కూతురి.. ప్రేమికుడ్ని జైలు పాలు చేసింది. కానీ చివరకు

కూతురు ఓ అబ్బాయిని ప్రేమించిందని తల్లికి తెలిసింది. అతడిని లవ్ చేయడం ఇష్టపడని తల్లి.. కూతురిపై ఎటువంటి నింద వేయకూడదో వేసింది. చివరకు కూతురి.. ప్రేమికుడ్ని జైలు పాలు చేసింది. కానీ చివరకు

మగాళ్లపై తప్పుడు కేసులు పెట్టే ఆడవాళ్లు ఇక జైలుకే! ఈ కేసు ఉదాహరణ!

ఇప్పుడిప్పుడే ఆడవాళ్లకు అనుకూలంగా కోర్టులు తీర్పులిస్తున్నాయి. దీన్నే అవకాశంగా తీసుకుంటున్నారు కొంత మంది మహిళలు. చట్టాలు తమకు అనుకూలంగా ఉన్నాయన్న భావనతో మనకు నచ్చని వ్యక్తులపై తప్పుడు కేసులు బనాయించిస్తున్నారు. నిజ నిర్ధారణలో ఇది ఫేక్ అని తెలిసి.. అదే చట్టం ముందు దోషులుగా నిలబడుతున్నారు. తాజాగా ఓ మహిళా.. ఓ వ్యక్తిపై కిడ్నాపింగ్, రేప్ కేసును బనాయించింది. ఇందులో బాధితురాలు మైనర్ కావడంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సోతో పాటు పలు చట్టాల కింద కేసులు బనాయించారు. చేయని తప్పుకు బాధితుడు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు..అదే సాక్షి తన స్టేట్ మెంట్ మార్చుకోవడంతో చెరసాల నుండి బయటపడ్డారు.

తప్పుడు కేసు పెట్టినందుకు మహిళకు ఆమెకు శిక్ష వేసింది కోర్టు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ అదనపు జిల్లా కోర్టు ఈ తీర్పు నిచ్చింది. వివరాల్లోకి వెళితే.. బరాది పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు. తన పెద్ద కుమార్తె సహోద్యోగి అజయ్ అలియాస్ రాఘవ్ తన చిన్న కుమార్తె (అప్పట్లో బాలికకు 15 సంవత్సరాలు)ను ఢిల్లీ తీసుకెళ్లాడని, మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజయ్ పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో బాధితురాలు కూడా నిందితుడికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడంతో నాలుగేళ్లు జైలులో ఉన్నాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత బాధితురాలు తన స్టేట్ మెంట్ మార్చుకుని, అసలు విషయం వెల్లడించింది.

అక్క, అజయ్ ప్రేమించుకున్నారని, ఆ విషయం సహించలేకపోయిన తల్లి.. అతడిపై అక్రమ కేసు పెట్టిందని, తనను ఒత్తిడి చేయడంతోనే తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చానని కోర్టుకు తెలిపింది బాధితురాలు. అప్పటి నుండి కేసు విచారణలతో విసిగిపోయాయనని చెప్పింది. దీంతో తప్పుడు కేసు బనాయించిన తల్లిపై సీరియస్ అయ్యింది కోర్టు. అక్రమ కేసు మూలంగా అజయ్ 1,653 రోజులు జైలులో ఉన్నాడని, దాని కాణంగా అతడు రూ. 5, 88, 822. 47 వేతనాన్ని కోల్పోయాడని పేర్కొంది. అజయ్ ఎన్ని రోజులైతే జైలు జీవితాన్ని గడిపాడో బాలిక తల్లి అని రోజులు జైలులో గడపాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు. మహిళపై ఐపీసీలోని సెక్షన్ 195 కింద కేసు నమోదు చేసింది. ఆమెకు రూ. 5.9 లక్షల నగదు జరిమానాతో పాటు 4 సంవత్సరాలు, 6 నెలల, 8 రోజుల శిక్షను ఖరారు చేసింది. కూతురు ప్రేమించిన వ్యక్తిని అంగీకరించలేని కన్నతల్లి..  ఏ తల్లి వేయకూడని నింద వేసి.. ఇప్పడు జైలు పాలు అయ్యింది.