P Krishna
Women Attack Electricity Officials: ఈ రోజుల్లో కరెంట్ లేనిదే ఒక్క పని కూడా జరగదని అంటారు. మనం వాడుకునే దాన్ని బట్టి కరెంట్ చార్జీలు వసూళ్లు చేస్తుంటారు విద్యుత్ అధికారులు.
Women Attack Electricity Officials: ఈ రోజుల్లో కరెంట్ లేనిదే ఒక్క పని కూడా జరగదని అంటారు. మనం వాడుకునే దాన్ని బట్టి కరెంట్ చార్జీలు వసూళ్లు చేస్తుంటారు విద్యుత్ అధికారులు.
P Krishna
కరెంట్ వాడకం అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయ్యింది. కరెంట్ లేనిదే ఏ చిన్న పని జరగదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కరెంట్ బిల్లులు వసూళ్లు చేస్తుంటారు. గృహ ప్రయోజనాలకు వాడుకునే కరెంట్ వందలు, వేలల్లో వస్తుంది. కొన్నిసార్లు విద్యుత్ అధికారుల తప్పిదాల వల్ల వందల్లో వచ్చే బిల్లు వేలు, లక్షల్లో రావడం చూస్తూనే ఉంటాం. దీంతో సదరు వినియోగదారుడు విద్యుత్ కార్యాలయానికి వెళ్లి లబోదిబో అంటుంటారు. కరెంట్ సమయానికి చెల్లించని యెడల అధికారులు డిస్ కనెక్ట్ చేయడం చూస్తూనే ఉంటాం. విద్యుత్ బకాయి చెల్లించకపోవడంతో కరెంట్ డిస్ కనెక్ట్ చేయడానికి వెళ్లిన అధికారులకు మహిళలు చుక్కలు చూపించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఒక వినియోగదారుడి విద్యుత్ సరఫరా డిస్ కనెక్ట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారుల బృందం, జూనియర్ ఇంజనీర్ పై కొంతమంది మహిళలు బండ బూతులు తిడుతూ కర్రలతో దాడి చేసి తరిమి కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేషన్ ఇన్ చార్జి మాట్లాడుతూ.. ‘విద్యుత్ బకాయీ చెల్లించని కారణంగా కరెంట్ కట్ చేయడానికి వచ్చిన అధికారులపై జమీల్ ఖాతన్, ఆమె కూతురు టీనా, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ చూస్తుండగా కర్రలతో దాడి చేశారు’ అని అన్నారు. దాడి అనంతరం అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.
జమిలా ఖాతూన్ పై జనవరి 29న విజిలెన్స్ అధికారులు రూ.98,207 విద్యుత్ చౌర్యానికి పాల్పపడినట్లు జేఈ సాగర్ మాలవ్య తెలిపారు. దీంతో వారికి జరిమానా విధించడం జరిగింది. కరెంట్ కోత విధిస్తామని చెప్పడంతో జమిలా ప్రస్తుతం తమ వద్ద రూ.40 వేలు ఉన్నాయి.. చెల్లిస్తామని చెప్పి డబ్బు చెల్లించారు. మిగిలిన బకాయి రూ.58,207 ను ఫిబ్రవరి 25 వరకు జమ చేస్తామని తెలిపారు. కానీ అనుకున్న సమయానికి డబ్బు చెల్లించకపోవడంతో జమిలా ఖాతూన్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ శాఖ. ఆదేశాల మేరకు అధికార బృందం జమీలా ఇంటికి కరెంట్ డిస్ కనెక్ట్ చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అధికారులను అడ్డుకున్న జమీలా కుటుంబ వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తామని అన్నారు పోలీసులు.