iDreamPost
android-app
ios-app

భర్త కార్పెంటర్.. భార్యను కష్టపడి చదివిస్తే.. ప్రియుడితో కలిసి

Wife Cheating.. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లు.. సక్సెస్ ఫుల్ ఉమన్ అయ్యేందుకు ఓ మగవాడు కష్టపడుతున్నాడు. కానీ ఆ కష్టాన్ని గుర్తించాల్సిన భార్య మాత్రం.. మంచి ఉద్యోగం, సంపాదన రాగానే కట్టుకున్న వాడ్ని దూరం పెడుతుంది.

Wife Cheating.. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లు.. సక్సెస్ ఫుల్ ఉమన్ అయ్యేందుకు ఓ మగవాడు కష్టపడుతున్నాడు. కానీ ఆ కష్టాన్ని గుర్తించాల్సిన భార్య మాత్రం.. మంచి ఉద్యోగం, సంపాదన రాగానే కట్టుకున్న వాడ్ని దూరం పెడుతుంది.

భర్త కార్పెంటర్.. భార్యను కష్టపడి చదివిస్తే.. ప్రియుడితో కలిసి

ఒకప్పుడు మోసం అంటే అబ్బాయిలే చేసేవారన్న ముద్ర ఉండేది. కానీ మగవాళ్లకు ఏం విషయంలో తీసిపోమని నిరూపిస్తున్న మహిళల్లో కొంత మంది.. చీటింగ్ చేయడంలో వాళ్లనే మించిపోయారు. భర్తకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధాలు నడపటం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. సంపాదన కనిపించగానే భర్తను లెక్క చేయకపోవడం, తనకు ఇష్టమొచ్చినట్లు నడుచుకోవడం, అవసరమైతే భర్తకు ఎదురు తిరగడం, మరొకరితో కట్టుకున్న వాడి ఎదుటే చనువుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసి మరొకర్ని పెళ్లి చేసుకుంటున్నారు. గతంలో బీహార్‌లో, ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు యుపిలోని ప్రయాగ్ రాజ్ తరహా ఘటన వెలుగు చూసింది.

గవర్నమెంట్ జాబ్ రాగానే ఓ మహిళ తన భర్తను వదిలేసిందో మహిళ. తీవ్ర మనస్థాపానికి గురైన భర్త మీడియా ముందు బాధను వ్యక్తం చేశాడు. తన భార్య తనకు కావాలంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. తను చిన్న పనులు చేసుకుని బతుకుతూ భార్యను చదవిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనిప్పించాడు. కానీ జాబ్ రాగానే ఆమె భర్తకు మొహం చాటేసి వెళ్లిపోయింది భార్య. ఈ విషయాన్ని అతడు ఆలస్యంగా గుర్తించాడు. బాధితుడు నీరజ్ విశ్వకర్మ చెబుతున్న వివరాల ప్రకారం.. నీరజ్, లేఖాపాల్ ఐదేళ్ల పాటు ప్రేమించుకుని 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. కార్పెంటర్‌గా పనులు చేస్తూ భార్యను చదివించి, గవర్నమెంట్ జాబ్ కోసం తర్ఫీదునిప్పించాడు. ఈ ఏడాది జనవరిలో కాలేజీకి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లిన లేఖా.. తిరిగి రాలేదు.

ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అంతలో ఆమెకు అకౌంటెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం రాగా, అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళుతుందని తెలిసి అక్కడికి చేరుకోగా.. వెనుక డోర్ నుండి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించిప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఆమె మరొకర్ని ప్రేమించి,  పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకొచ్చాడు. తన భార్యను తిరిగి తనకు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు డిస్ట్రిక్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశాడు. యుపిలో ప్రయాగ్ రాజ్‌లో గతేడాది ఈ తరహా ఘటన వెలుగు చూసింది. జ్యోతి మౌర్య అనే మహిళను భర్త చదివించగా..  ఉన్నతోద్యోగం రాగానే.. భర్తను వదిలేసి, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.  మొగుడు అడ్డు తొలగించుకునేందుకు అతడిపై తప్పుడు కేసులు బనాయించింది. బయటకు వచ్చిన భర్త తనకు జరిగిన అన్యాయం గురించి గగ్గోలు పెడితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి