iDreamPost
android-app
ios-app

ఎన్నికల ముందు LPG గ్యాస్‌ ధర తగ్గనుందా? మోదీ గుడ్ న్యూస్ చెప్తారా?

గత ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలు.. పలు హామీలను గుప్పించాయి. వాటిల్లో ఒకటి.. కేంద్ర సర్కార్ అందించింది. గ్యాస్ సిలిండర్ రూ. 500 ఇస్తామని హామీనిచ్చింది.ఈ ఏడాది కూడా పలు రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లెక్క ప్రకారం..

గత ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలు.. పలు హామీలను గుప్పించాయి. వాటిల్లో ఒకటి.. కేంద్ర సర్కార్ అందించింది. గ్యాస్ సిలిండర్ రూ. 500 ఇస్తామని హామీనిచ్చింది.ఈ ఏడాది కూడా పలు రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లెక్క ప్రకారం..

ఎన్నికల ముందు LPG గ్యాస్‌ ధర తగ్గనుందా? మోదీ గుడ్ న్యూస్ చెప్తారా?

దేశంలో నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. మరీ ఇవి తగ్గాలంటే.. ఏం చేయాలి.. ఎన్నికలు రావాలి. అవును.. నిత్యావసర సరుకులతో పోల్చుకుంటే చమురు, సిలిండర్ ధరలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఈ ఏడాది పలు రాష్ట్ర అసెంబ్లీలకు, అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వాగ్దానాల రూపంలో వీటి ధరలకు అడ్డుకట్ట పడొచ్చు. గత ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికల ముందు గ్యాస్ సిలిండర్ రూ. 200 కేంద్రంలోని మోడీ సర్కార్ తగ్గించిన సంగతి విదితమే. అలాగే మొన్న పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 10 వరకు తగ్గే అవకాశం ఉందని పలు మీడియా కథనాలు వెలువడిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి గ్యాస్ సిలిండర్ ధర తగ్గనుందట.

గత సంవత్సరం ఆగస్టు నెలలో అంటే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే మూడు నెలల ముందు కేంద్రంలోని మోడీ సర్కార్.. ఎల్‌పీజీ సిలిండర్స్ ధరలను రూ. 200 తగ్గించింది. ఇప్పడు.. ప్రతి పేద కుటుంబానికి తక్కువ ధరకే సిలిండర్ అందించాలని మోడీ సర్కార్ యోచలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద అందించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సబ్సిడీ  మొత్తాన్ని మరింత పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ పథకం కింద లబ్దిదారులు ఢిల్లీలో 14.4 కేజీల గృహ సిలిండర్ రూ. 603కి పొందుతున్నారు. అదే సబ్సడీ లేకపోతే ఆ సిలిండర్ ధర రూ. 1200 పలుకుతుండటం గమనార్హం.

Will LPG Gas Price Come Down

 ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎల్‌పీజీ ధరలకు  సంబంధించి భారీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇటీవల మధ్యప్రదేశ్,రాజస్థాన్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజెపీ సిలిండర్ ధరను రూ 500 హామీనిచ్చారు. ఇటు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్..కూడా ఇటుంటి హామీనే ఇచ్చింది. కానీ ఎక్కడా ఈ హామీ అమలు కాలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో..కేంద్రం గ్యాస్ సిలిండర్లపై ధరలను తగ్గించడం కానీ, రాయితీని మరిం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు రూ. 33 కోట్లు. గతేడాది 2025-26 నాటికి మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్ల అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.