iDreamPost
android-app
ios-app

వీడియో: కోర్టు అవరణలో భర్తను చితక్కొట్టిన భార్య.. ఎందుకంటే?

  • Published May 10, 2024 | 3:23 PM Updated Updated May 10, 2024 | 3:23 PM

Wife Attack on Husband: ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయే పరిస్థితి నెలకొంటుంది. భార్య తన భర్తపై కోర్టు ప్రాంగణంలో చేయి చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది.

Wife Attack on Husband: ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయే పరిస్థితి నెలకొంటుంది. భార్య తన భర్తపై కోర్టు ప్రాంగణంలో చేయి చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది.

వీడియో: కోర్టు అవరణలో భర్తను చితక్కొట్టిన భార్య.. ఎందుకంటే?

భారత దేశంలో వివాహ బంధానికి ఎంతో విలువనిస్తారు. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధందో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని బంధుమిత్రులు, పెద్దలు దీవిస్తుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది భార్యాభర్తలు పెళ్లైన కొన్నాళ్లకే వివిధ కారణాల వల్ల విడిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వరకట్న కారణాల వల్ల విడిపోతున్నారు. ఇటీవల అక్రమ సంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దాడి చేయడం, హత్యలకు కూడా తెగబడుతున్నారు. బీహార్‌లోని జముయ్ జిల్లాలో ఓ వ్యక్తి మొదటి మహిళకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.దీంతో రెండవ భార్య అతనికి గుణపాఠం నేర్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తున్నాయి. క్షణిక సుఖం కోసం దంపతులు ఒకరినొకరు మోసం చేసుకుంటూ అక్రమ సంధాలు కొనసాగిస్తున్నారు. అవి కాస్త బయట పడటంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం.. చివరికి చంపుకునే వరకు వెళ్తున్నాయి. కట్టుకున్న భార్య బతికి ఉన్నపుడు మరో మహిళను వివాహం చేసుకోవడం చట్టరిత్యా నేరం అన్న విషయం తెలిసిందే. ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో యువతితో ప్రేమాయణం కొనసాగించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య భర్తకు పబ్లిక్ గా తగిన గుణపాఠం చెప్పింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని జముయ్ జిల్లాలో ఓ వ్యక్తి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

జాముయి జిల్లాలోని ఝఝా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్ని నివాసి వికాస్ కుమార్ ఏడేళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని తారాదిహ్ గ్రామంలో నివాసం ఉంటోంది. పెళ్లయి ఏడేళ్లు గడిచినా భార్యాభర్తలకు పిల్లలు కలగలేదు. వికాస్ ఈ విషయంలో పదిమంది అంటున్న మాటలు తట్టుకోలేక తన భార్యను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మొదటి భార్య తన భర్తపై ఫ్యామిలీ కోర్టు, జముయి సివిల్ కోర్టులో మూడు వేర్వేరు కేసులు వేసింది.అప్పటి నుంచి కోర్టు చుట్టు తిరుగుతున్నాడు వికాస్. ఎట్టకేలకు కేసులకు వ్యతిరేకంగా పాట్నా హైకోర్టు నుంచి కొన్ని షరతులపై బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న మొదటి భార్య వికాస్ ని చూసి కోపంతో ఊగిపోయింది. తనకు అన్యాయం చేశావంటూ అతన్ని పట్టుకొని చితక్కొట్టింది. ప్రస్తుతం జార్ఖండ్‌లోని డియోఘర్‌లో వికాస్ కుమార్ కూలీగా పనిచేస్తున్నాడు.కోర్టు ఆవరణలో వికాస్ కుమార్ పై మొదటి భార్య దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.