iDreamPost

kurkure Packet: భలే భార్యండి బాబు.. కుర్ కురే కొనివ్వలేదని విడాకులు!

కాలంలో కొందరు దంపతులు దారుణంగా తయారయ్యారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటున్నారు.  ఇంకా దారుణం ఏమిటంటే.. వంటల విషయం,బట్టల విషయంలో గొడవలు పెట్టుకుని చివరకు విడాకులకు వెళ్తున్నారు.

కాలంలో కొందరు దంపతులు దారుణంగా తయారయ్యారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటున్నారు.  ఇంకా దారుణం ఏమిటంటే.. వంటల విషయం,బట్టల విషయంలో గొడవలు పెట్టుకుని చివరకు విడాకులకు వెళ్తున్నారు.

kurkure Packet: భలే భార్యండి  బాబు.. కుర్ కురే కొనివ్వలేదని విడాకులు!

సంసారంలో గొడవలు అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా దంపతుల మధ్య చిన్న చిన్న వాదనలు జరుగుతునే ఉంటాయి. అలావచ్చి.. ఇలా పోతూ ఉంటాయి. అయితే నేటికాలంలో కొందరు దంపతులు దారుణంగా తయారయ్యారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటున్నారు.  ఇంకా దారుణం ఏమిటంటే.. వంటల విషయం,బట్టల విషయంలో గొడవలు పెట్టుకుని చివరకు విడాకుల వరకు వెళ్తున్నారు. వీరందరిని మించి ఓ జంట కేవలం ఐదు రూపాయ కుర్ కురే విషయంలో గొడవ పడింది. చివరకు వీరి కుర్ కురే వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. మరి..పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రాలోని షాహ్‌ గంజ్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కేవలం ఐదు రూపాయల కుర్‌కురే వల్ల వచ్చిన వివాదం భార్యాభర్తల దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టింది. తనకు కుర్‌కురే ప్యాకెట్‌ కొనివ్వలేదని భర్తతో గొడవపడి ఓ వివాహిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంకా దారుణం ఏమిటంటే ఏడాది క్రితమే వారికి వివాహం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలోని షాహ్‌గంజ్‌కు చెందిన ఓ దంపతులకు గతేడాదిలో  ఘనంగా వివాహం జరిగింది. ఇక ఆ భార్యకు కుర్‌కురే అంటే ఎంతో ఇష్టం. రోజూ కచ్చితంగా ఒక కుర్‌కురే ప్యాకెట్‌ తిన్నంది ఆమెకు నిద్రపట్టదు. పెళ్లైన కొత్తలో ఇదే విషయం భర్తకు చెబితే అతడు సరే అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం..పెళ్లైన కొత్తలో రోజూకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్‌కురే ప్యాకెట్‌ తీసుకొచ్చి భార్యకు ఇచ్చేవాడు.

అయితే పని ఒత్తిడో లేక మరేదో కారణంతో ఒకరోజు కుర్‌కురే ప్యాకెట్ ను ఇంటికి తీసుకెళ్లడం మరిచిపోయాడు. దీంతో సదరు మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు ఎంతో ఇష్టమైన కుర్‌కురే తీసుకురాలేదని భర్తతో వాగ్వాదం పెట్టుకుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావని భర్త అన్నా కూడా ఆమె వినిపించుకోలేదు. దీంతో ఒక్కసారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అలిగిన భార్య.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన కోరికలను తీర్చని వ్యక్తితో ఉండే కంటే విడిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అంతటితో ఆగక తన ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమైంది. తనకు విడాకులు ఇప్పించాలని పోలీసులకు సదరు భార్య ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదును పోలీసులు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెల్‌కు బదిలీ చేశారు. దీంతో భార్యాభర్తలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.ఈ క్రమంలోనే అధికారులు ఆరా తీయ్యగా.. కుర్‌కురే కోసం గొడవ జరిగిందని తెలిసి షాకయ్యారు. చిన్న కారణంతోనే విడాకులకు సిద్ధమైన ఆ దంపతులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు నచ్చజెప్పారు. ప్రస్తుతం అయితే వీరి విడాకుల కేసు వాయిదా పడింది. ఇటీవలే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదని ఓ మహిళ కూడా ఇదే తరహ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి