iDreamPost
android-app
ios-app

నా భర్తను చంపితే రూ.50 వేల రివార్డు ఇస్తా! సుపారీ ఇస్తున్న మహిళ

  • Published Apr 01, 2024 | 12:20 PM Updated Updated Apr 01, 2024 | 12:36 PM

Wife Announces Reward: వివాహ బంధం ఎంతో పవిత్రమైనది.. భార్యా భర్తలు నూరేళ్లు చల్లగా కలిసిమెలిసి జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. ఈ మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారు.

Wife Announces Reward: వివాహ బంధం ఎంతో పవిత్రమైనది.. భార్యా భర్తలు నూరేళ్లు చల్లగా కలిసిమెలిసి జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. ఈ మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారు.

  • Published Apr 01, 2024 | 12:20 PMUpdated Apr 01, 2024 | 12:36 PM
నా భర్తను చంపితే రూ.50 వేల రివార్డు ఇస్తా! సుపారీ ఇస్తున్న మహిళ

ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం, కొట్లాడుకోవం చూస్తున్నాం. సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, విభేదాలు తామరాకుపై నీటి బిందువులాంటిది. గొడవ పడతారు..మళ్లీ కలిసి పోతారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. హంతకులకు సుపారీ ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు దేశంలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  తన భార్య వల్ల  ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు ఓ భర్త. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఆగ్రాలోని బాహ్ జిల్లాకు చెందిన ఒక జంట మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.  భార్య తన వాట్సాప్ స్టేటస్ లో నా భర్తను చంపిన వారికి రూ.50 వేలు నగదు ఇస్తానని రాసుకొచ్చింది. అది చూసి భర్త గుండె గుభేల్ మంది. తనని చంపిన వారికి రూ.50 సుపారీ ఇస్తామని భార్య ప్రకటించడంతో భయాందోళనకు గురయ్యాడు. తనకు ప్రాణ హాని ఉందని వెంటనే పోలీసులకు వద్దకు వేళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాహ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి శ్యాం సింగ్ తెలిపారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022 లో తమ పెళ్లైందని.. పెళ్లైన కొత్తలో తన భార్య తనతో ఎంతో సంతోషంగా ఉందని, కొన్నిరోజులుగా తమ మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుందని.. తన భార్య కావాలని గొడవ పెట్టుకుంటుందని బాధితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

కొన్ని రోజుల నుంచి ఫోన్లో ఎవరితో గంటల తరబడి మాట్లాడటం.. ఏంటని ప్రశ్నిస్తే నాపై సీరియస్ కావడం జరుగుతుందని.. ఇటీవల నాతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయిందని, అక్కడ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనని హత్య చేసి ఆస్తి దక్కించుకోవాలని చూస్తుందని పోలీసుల ముందు బాధితుడు వాపోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి గతంలో తనకు పలుమార్లు ఫోన్ చేసి చంపుతానని బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, ఆమె ప్రేమికుడి నుంచి రక్షించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

 

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş