Krishna Kowshik
కేరళను అతలాకుతలం చేసేశాయి వానలు, వరదలు. వయనాడ్ మిగిల్చిన విషాదం చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికే 350 మంది మరణించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కేరళను అతలాకుతలం చేసేశాయి వానలు, వరదలు. వయనాడ్ మిగిల్చిన విషాదం చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికే 350 మంది మరణించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Krishna Kowshik
కేరళలోని వయనాడ్ జిల్లాలో సృష్టించిన వరద భీభత్సం మాటలకు అందని విషాదం. ఆ జిల్లాలోని నాలుగు గ్రామాలు కొండచరియలు విరిగిపడి నామ రూపాలు లేకుండా మాయమైపోయాయి. సుమారు 370 మంది మరణించారు. మరికొంత మంది ఆచూకీ గల్లంతైంది. వీరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ, నావి, ఫారెస్ట్, పోలీసులు దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతటి పెను విపత్తుకు కారణం ఓ గజరాజు శోకమని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఓ గజరాజును పొట్టన పెట్టుకున్న శాపమే.. ఇప్పుడు ఇంతటి విషాదానికి కారణమని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగును పేలుడు పదార్థాలు కలిపిన పైనాపిల్ పెట్టగా..అది పేలి తీవ్రమైన నొప్పితో మరణించింది.
ఆ ఏనుగును చంపిన గ్రామంపైనే ప్రకృతి పగబట్టి.. తుడిచిపెట్టుకుపోయేలా చేసిందని వార్త జోరుగా కొనసాగుతుంది. నిజంగా ఏనుగుల శాపమే ఆ గ్రామాన్ని విషాదంలో ముంచేసిందా. ఈ ప్రచారం ఎంత వరకు వాస్తవం అనే అంశాన్ని పరిశీలిస్తే.. కేరళలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగులు ఎక్కువగా జీవిస్తుంటాయి. ఒక్కొక్కసారి గ్రామాల మీదకు వచ్చేస్తుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోకి ఆడ ఏనుగు వచ్చేసింది. అది అప్పటికే గర్భిణీ. ఈ విషయం తెలియని గ్రామస్థులు దాడి చేస్తుందేమోనన్న భయంతో పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి.. దాని నోటికి అందించారు. నమిలిన వెంటనే ఒక్కసారిగా పేలింది. తీవ్రంగా రక్తం కారుతూ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయింది. మెలిపెడుతున్న బాధ, ఓ పక్క కడుపులో ఉన్న బిడ్డ ఆకలితో వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. తీవ్రమైన గాయాలతో నీటిలోనే ఉండిపోయింది.
ఏనుగుకు పేలుడు పదార్థాన్ని పెట్టారని తెలిసి, అటవీశాఖ సిబ్బంది దాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ రాలేదు. మరో రెండు ఏనుగుల సాయంతో 2020 మేలో నదిలో నుండి బయటకు తీసుకు రాగా, చనిపోయిందని అధికారులు గుర్తించారు. బిడ్డతో సహా తల్లి ఏనుగు ప్రాణాలు విడిచింది. అప్పట్లో దీన్ని మల్లప్పురం అటవీశాఖ అధికారి ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఈ శాపమే కేరళలో వరదలు, కొండచరియలు విరిగి పడటానికి కారణమంటూ సోషల్ మీడియాలో ఆరాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలను ట్రోల్ చేస్తన్నారు. విఘ్నేశ్వరుడితో సమానమైన గజరాజును చంపడం వల్లే వయనాడ్ విలయానికి కారణమంటున్నారు. కాగా, ఈ వాదనను కొంత మంది తోసిపుచ్చుతున్నారు. వరదలు వచ్చింది వయనాడ్ జిల్లాలో అని రెండింటికీ సంబంధం లేదని అంటున్నారు. అదేప్పుడో నాలుగేళ్ల క్రితం జరిగిందని, కష్ట సమయంలో ఉన్న కేరళలో ఇలాంటి వార్తలు పుట్టించడం సరికాదని పేర్కొంటున్నారు. కాగా, గజరాజుకు అంత కోపం ఉంటే ఇటీవల జరిగిన వరదల్లో నలుగుర్ని కాపాడే కాదని అంటున్నారు.