iDreamPost
android-app
ios-app

మీమ్స్‌లో కనిపించే ఈ సింగర్ గురించి తెలుసా? అరుస్తూ పాడడానికి కారణమిదే!

  • Published Aug 01, 2024 | 11:09 AM Updated Updated Aug 01, 2024 | 11:09 AM

Reason Behind Jyoti Nooran Sings While Shouting: మీమర్స్, ట్రోలర్స్ కొంతమందిని అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు. మీమ్స్ లో వైరల్ చేస్తుంటారు. అయితే మీమ్స్ లో కనిపించే ఈ సింగర్ గురించి తెలుసా? ఈమె ఎందుకు అలా అరుస్తూ పాడతారో తెలుసా? తెలిస్తే మీమ్స్ లో వేయరు. మీమ్స్ లో చూసినప్పుడు నవ్వరు.

Reason Behind Jyoti Nooran Sings While Shouting: మీమర్స్, ట్రోలర్స్ కొంతమందిని అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు. మీమ్స్ లో వైరల్ చేస్తుంటారు. అయితే మీమ్స్ లో కనిపించే ఈ సింగర్ గురించి తెలుసా? ఈమె ఎందుకు అలా అరుస్తూ పాడతారో తెలుసా? తెలిస్తే మీమ్స్ లో వేయరు. మీమ్స్ లో చూసినప్పుడు నవ్వరు.

  • Published Aug 01, 2024 | 11:09 AMUpdated Aug 01, 2024 | 11:09 AM
మీమ్స్‌లో కనిపించే ఈ సింగర్ గురించి తెలుసా? అరుస్తూ పాడడానికి కారణమిదే!

ఎవరైనా వ్యక్తులు లేదా సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను మీమర్స్ మీమ్స్ లో వాడుకుంటూ ఉంటారు. ఏదో ఒక సమయంలో వైరల్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఈ జ్యోతి నూరాన్ ఒకరు. ఈమె గురించి తెలియక చాలా మంది ఈమెను ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్ లో కామెడీ చేస్తున్నారు. ఈమె ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా పాడుతూ.. చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు. దీన్ని చాలా  మంది కామెడీగా చూపిస్తున్నారు. అయితే ఇలా పాడడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకునే ముందు ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలి.       

ఆమె పేరు జ్యోతి నూరాన్ ఒక సింగర్. కేవలం దైవ సంబంధిత పాటలు మాత్రమే పాడతారు. ఈమెకి ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె పేరు సుల్తానా నూరాన్. వీరిద్దరూ కలిసి ఆధ్యాత్మిక పాటలు మాత్రమే పాడతారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. వంశపారంపర్యంగా ఆధ్యాత్మిక పాటలను పాడుతూ వస్తున్నారు. ఈ అక్కచెల్లెళ్ళు కూడా సింగింగ్ నే తమ కెరీర్ గా ఎంచుకున్నారు. అయితే సినిమా పాటలు పాడితే బోలెడన్ని డబ్బులు వస్తాయి కదా అని వీళ్ళు ఆశపడి అటువైపు వెళ్ళలేదు. తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి.. దైవ సంబంధిత పాటలు మాత్రమే పాడుతూ వచ్చారు.  

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ గ్రామానికి చెందిన వారు. పదేళ్ల పాటు వీరు తండ్రి దగ్గర ఆధ్యాత్మిక పాటలు పాడడం నేర్చుకున్నారు. 17వ శతాబ్దానికి చెందిన బుల్లెహ్ షా అనే పాపులర్ కవి రాసిన కవితలతో వీరు ప్రభావితం చెందారు. దీంతో వాళ్ళు పాటలు పాడడం ప్రారంభించారు. కెరీర్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ పలు అవకాశాలు దక్కించుకున్నారు. ఎంటీవీలోని సౌండ్ ట్రిన్ షోలో టంగ్ టంగ్ అనే పాటను ప్రదర్శించారు. దీంతో వాళ్ళు ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. పంజాబీ, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అనేక పాటలతో ఫేమస్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. కానీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అవకాశం ఉండి కూడా డబ్బు కోసం సినిమా పాటలు పాడాలని అనుకోలేదు.

తమ జీవితం దైవానికి అంకితం అని చెప్పి ఆధ్యాత్మిక పాటలే పాడుతున్నారు. ఇప్పటికీ అదే మాట  మీద నిలబడ్డారు. అయితే జ్యోతి నూరాన్ పాడేటప్పుడు గట్టిగా, చప్పట్లు కొడుతూ పాడతారు. దీనికి కారణం.. ఇలా పాడడం వల్ల శక్తి వస్తుంది. గంటల తరబడి లైవ్ లో పాడుతూ ఉండాలి. తమకు, పక్కన ఉన్న సంగీత కళాకారులకి ఉత్తేజం, శక్తి రావడం కోసం ఇలా అరుస్తూ, చప్పట్లు కొడతారు. చాలా మంది సంగీత కళాకారుల్లో ఇది సాధారణమే. లేదంటే అన్నేసి గంటలు పాడలేరు. ఇలా అరుస్తూ, చప్పట్లు కొడుతూ పాడడం వల్ల పాడేవారికి, సంగీతం వాయించే వారికి, వినే వారికి అందరికీ ఉత్తేజం వస్తుంది. ఆమె భక్తి పాటల కోసం.. జనాల్లో భగవంతుని చైతన్యం నింపడం కోసం ఇలా చేస్తున్నారు. ఇది తెలియక చాలా మంది మీమ్స్ లో కామెడీగా వాడుతున్నారు. ఇక నుంచి మీమ్స్ లో ఈమెను ట్రోల్ చేస్తే నవ్వకండి అని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Jyoti norran (@jyoti.nooran.1998)