iDreamPost
android-app
ios-app

సినిమా స్టైల్లో ఫ్యామిలీ మొత్తం కనిపించకుండా పోయింది! కట్‌ చేస్తే..

  • Published Feb 05, 2024 | 7:47 PM Updated Updated Feb 05, 2024 | 7:47 PM

దేశంలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు కారణంగా.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని కారణంగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం . కానీ, ఇక్కడ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక కుటుంబమే అదృశ్యమైంది.

దేశంలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు కారణంగా.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని కారణంగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం . కానీ, ఇక్కడ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక కుటుంబమే అదృశ్యమైంది.

  • Published Feb 05, 2024 | 7:47 PMUpdated Feb 05, 2024 | 7:47 PM
సినిమా స్టైల్లో ఫ్యామిలీ  మొత్తం కనిపించకుండా పోయింది! కట్‌ చేస్తే..

ఈరోజుల్లో ప్రాణాల కంటే పరువే ఎక్కువ అనుకుని.. జీవితంలో ఏ రకంగా దెబ్బతిన్న కూడా ప్రాణాలను వదిలేస్తున్నారు.. లేదా ఆ కుటుంబం నుంచి వేరైపోతున్నారు. వారిలో ముఖ్యంగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేని వారు, ఇతరులకు షూరిటీ ఉండి తమ మీదకు తెచుకున్నవారు.. ఇలా ఎంతో మంది ఏం చేయాలో అర్థంకాక .. దిక్కు తోచని పరిస్థితులలో కుటుంబానికి దూరం అవుతూ ఉంటారు. ఇప్పటివరకు ఇలాంటి వార్తలను మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం . అయితే , ఇప్పటివరకు చూసిన వాటిలో కుటుంబ యజమాని ప్రాణహాని చేసుకోవడం చూసి ఉంటాము. కానీ, ఇటీవల జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. తల్లి, తండ్రి., భార్య , బిడ్డతో సహా .. ఏకంగా మొత్తం కుటుంబమే కనుమరుగైపోయింది.

ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది. మైసూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి మార్కెటింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతను తన కుటుంబంతో కలిసి కేజీకొప్పులలో నివసిస్తూ ఉంటాడు. అయితే మహేష్ ఉన్నట్లుండి .. గత నెల అంటే జనవరి 20 తన కుటుంబంతో సహా ఎవరికి కనిపించకుండ కనుమరుగైపోయాడు. మహేష్(35), అతని భార్య భవాని(28), కుమార్తె ప్రేక్ష(3), తండ్రి మహాదేవప్ప(65), తల్లి సుమిత్ర(53).. వీరంత గత నెల నుంచి కనిపించకుండా పోయారు. దానికంటే ముందు మహేష్ తన స్నేహితుల సెల్ కు కొన్ని వాయిస్ మెసేజులు పెట్టాడు. ఏ బావిలోనో , చెరువులోనో దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పాడు. దీనితో ఆందోళన చెందిన వారి మిగిలిన కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఈ విచారణ జరుగుతూ ఉంది.

ఎక్కడికి వెళ్లారో .. ఏమైపోయారో అంతుచిక్కకుండా పోయిన ఈ కుటుంబం మిస్సింగ్ కేసు.. ఎట్టకేలకు తేలింది. పోలీసులు ఈ కేసులో తీవ్ర విచారణ చేపట్టి వారి జాడను కనుక్కున్నారు. మహేష్ కుటుంబం ఇన్ని రోజులు బెంగుళూరులో ఉన్న మహేష్ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీనితో విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. మహేష్ తన స్నేహితుడైన వీరేష్ అనే వ్యక్తి రూ. 35 లక్షల అప్పు తీసుకోగా మహేష్ షూరిటీగా ఉన్నాడు. కానీ ఆ డబ్బుతో వీరేష్ పరారు కావడంతో.. ఆ అప్పు తీర్చాలని రుణదాతలు మహేష్ వెంటపడ్డారు. దీనితో అంత అప్పు తానూ తీర్చలేక.. కుటుంబంతో సహా పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.