iDreamPost
android-app
ios-app

సామాన్యులకు అయోధ్య దర్శనం ఎప్పుడంటే..? పూర్తి వివరాలివే

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా పూర్తయ్యింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ వేడుక కన్నుల పండుగా జరిగింది. మరీ సామాన్యులకు శ్రీరాముని దర్శనం ఎప్పటి నుండి అంటే.. టైమింగ్స్, ఇతర సేవల వివరాలు ఇవిగో..

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా పూర్తయ్యింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ వేడుక కన్నుల పండుగా జరిగింది. మరీ సామాన్యులకు శ్రీరాముని దర్శనం ఎప్పటి నుండి అంటే.. టైమింగ్స్, ఇతర సేవల వివరాలు ఇవిగో..

సామాన్యులకు అయోధ్య దర్శనం ఎప్పుడంటే..? పూర్తి వివరాలివే

శ్రీరాముని జన్మ స్థానం అయోధ్య తిరిగి ఆయన రాకతో (విగ్రహ పత్రిష్టాపన) ఆ నేల పులకించిపోతుంది. కేవలం అయోధ్యే కాదూ యావత్ భారతావని సైతం ఆధ్మాత్మికతతో కూడిన భావోద్వేగాలతో పరవశిస్తోంది. జనవరి 22 చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికింది భారత్. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా..ఈ ప్రాణ పత్రిష్టాపన కార్యక్రమం పూర్తయ్యింది. లక్షలాది మంది హిందూ భక్తులు ఈ అద్భుత, సుందర దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. బాల రాముడు గర్బగుడిలో కొలువు తీరి ఉన్నాడు. ఇప్పటికే వేలాది మంది భక్తులు అక్కడకు చేరుకుని కన్నులారా దేవాలయాన్ని వీక్షించారు. అయితే వీరందరికీ గర్భగుడిలోకి ప్రవేశం లేదు. అక్కడ ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై చూసి భక్తి పారవంశ్యం పొందారు.

కాగా, భక్తులకు మంగళవారం నుండి దర్శనం కల్పించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. గుడి విశేషాలు, దేవాలయం, సందర్శన వేళలు వివరించారు. 2.7 ఎకరాల్లో నిర్మించిన ఆలయంలో బాహ్య ప్రాకారం దాటి లోపలికి రావాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఐదు నిర్మాణాలతో పాటు గర్బాలయం ఉంటుందని చెప్పారు. 795 మీటర్ల పరిధిలో ఉండే పర్కోటాలో 5 ఆలయాలుంటాయి. వాటిలో గర్భగుడి ఉంటుంది. గర్భగుడికి ముందు 5 మండపాలుంటాయని చెప్పారు. ఇక దేవాలయం దర్శన వివరాలు వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి వరకు తెరుచుకుని ఉంటుంది. ఆలయంలో దర్శనం కోసం రెండు స్లాట్ లు నిర్ణయించారు.

మొదటి స్లాట్ ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు.. రెండో స్లాట్ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటవ వరకు ఉంటుంది. అలాగే మూడు హారతులు ఉండనున్నాయి. ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు హారతులు ఉంటాయి. అయితే ఇవి పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తారు. అయితే వీటిని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు మిశ్రా. దర్శనం, హారతుల కోసం ముందుగానే ఆలయ అధికారిక వెబ్ సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి.. టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆలయం లోపలికి వెళ్లే ముందు మందిర ప్రాంగణంలో ఉన్న కౌంటర్ వద్ద పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం.. మీరు ఈ గుడిని సందర్శించాలనుకుంటున్నయితే.. అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి.. లాగిన్ అయ్యి.. బుక్ చేసుకోండి.