nagidream
Minimum Salary, Pension Under 8th Pay Commission: 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్ అనేవి భారీగా పెరిగాయి. దీంతో ఇప్పుడు 8వ వేతన సంఘంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగుతాయి?
Minimum Salary, Pension Under 8th Pay Commission: 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్ అనేవి భారీగా పెరిగాయి. దీంతో ఇప్పుడు 8వ వేతన సంఘంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగుతాయి?
nagidream
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్తుంటుంది. కనీస వేతన పెంపుని, పెన్షన్ పెంపుని సవరిస్తూ కొత్త పే కమిషన్ ని అమలు చేస్తుంటుంది. గతంలో 6వ పే కమిషన్ సమయంలో దాన్ని సవరిస్తూ 7వ పే కమిషన్ ని అమల్లోకి తీసుకొచ్చింది. 7వ వేతన సంఘం 2016 జనవరి 1న అమల్లోకి వచ్చింది. దీంతో కోటి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ప్రయోజనాలు చేకూరాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త వేతన కమిషన్ ని తీసుకొస్తుంటుంది కేంద్రం. ఈ క్రమంలో 8వ వేతన సంఘాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. 2025 డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం ముగుస్తుంది. దీంతో 2026 జనవరి 1న 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత ఏడాది కాలంగా ఉద్యోగుల సంఘాల నుంచి పలు ఫిర్యాదులు తీసుకున్న కేంద్రం.. తదుపరి వేతన సంఘం గురించి ఎలాంటి గడువు ఇవ్వలేదు. ఇటీవల బడ్జెట్ ప్రకటన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ టీ.వీ. సోమనాథన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 8వ వేతన సంఘం గురించి అప్డేట్ ఇచ్చారు. 8వ వేతన సంఘం అమలుకు తగినంత సమయం ఉందని అన్నారు. 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారుతున్నప్పుడు ఉద్యోగుల సంఘాలు వేతన సవరణ కోసం 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని 2.57 వద్ద సెట్ చేసింది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రివిజన్ ఆధారంగా గత వేతన సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 7 వేల నుంచి నెలకు 18 వేలకు పెరిగింది. ఇది గత కమిషన్ తో పోలిస్తే 2.57 రెట్లు పెరిగింది. అలానే 3,500 రూపాయలుగా ఉన్న పెన్షన్ 9 వేల రూపాయలకు పెరిగింది. గరిష్ట వేతనం కూడా 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వద్ద 2 లక్షల 50 వేలకు, పెన్షన్ గరిష్టంగా 1,25,000కి పెరిగింది. అయితే 7వ వేతన సంఘం అప్పుడు కేంద్ర ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేసిన 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని కేంద్ర ప్రభుత్వం సవరించనుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం కింద 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వద్ద పే మ్యాట్రిక్స్ ని సిద్ధం చేస్తుంది. ఈ 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తో ప్రస్తుతం 18 వేలుగా ఉన్న కనీస వేతనం 34,650కి సవరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలానే పెన్షన్ ని కూడా రూ. 17,280కి ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.