iDreamPost
android-app
ios-app

ఇండియాలోని ఆ జైళ్లకు ఖైదీల్లా కాదు.. యాత్రికుల్లా వెళ్లొచ్చు!

పర్యాటక ప్రదేశాలు అంటే.. కోటలు, భవనాలు, ప్రదేశాలు, పార్కులు ఇలా చాలానే గుర్తుకు వస్తాయి. కానీ ఎవరైనా జైలును సందర్శించాలని అనుకుంటారా?. అలా జైలుకు వెళ్లాలి అని ఎవరూ అనుకోరు. అయితే జైలుకు ఖైదీగా కూడా టూరిస్ట్‌గా వెళ్లి షికారు చేయాలని భావిస్తుంటారు.

పర్యాటక ప్రదేశాలు అంటే.. కోటలు, భవనాలు, ప్రదేశాలు, పార్కులు ఇలా చాలానే గుర్తుకు వస్తాయి. కానీ ఎవరైనా జైలును సందర్శించాలని అనుకుంటారా?. అలా జైలుకు వెళ్లాలి అని ఎవరూ అనుకోరు. అయితే జైలుకు ఖైదీగా కూడా టూరిస్ట్‌గా వెళ్లి షికారు చేయాలని భావిస్తుంటారు.

ఇండియాలోని ఆ జైళ్లకు ఖైదీల్లా కాదు.. యాత్రికుల్లా వెళ్లొచ్చు!

సాధారణంగా ఎవరైనా జైలుకు వెళ్లాలని అసలు కోరుకోరు. ఏదైనా తప్పులు చేసిన వారిని జైలుకు పంపిస్తుంటారు. కొందరిని తాత్కలికంగా పంపించగా,  మరికొందరిని కోర్టు విధించిన శిక్ష ఆధారంగా జైళ్లకు పంపిస్తుంటారు. అయితే ఎవరైనా టూరిస్టులు జైలుకు వెళ్లాలని అనుకుంటారు. చాలా మంది పర్యాటక ప్రదేశాలు అంటే.. కోటలు, భవనాలు, ప్రదేశాలు, పార్కులనే సందర్శిస్తారు. కానీ ఎవరైనా జైలును సందర్శించాలని భావిస్తారు. అలాంటి వాళ్లకు నిజమైన జైళ్లే ఉన్నాయి. ఇది కూడా మన ఇండియాలోనే ఖైదీల మాదిరిగా టూరిస్ట్ లు వెళ్లే జైళ్లు ఉన్నాయి. మరి.. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది పర్యాటకులకు వివిధ రకాల ప్రదేశాల్లో యాత్రలు చేయాలని అనుకుంటారు. కొండలు, అడవులు, దేవాలయాలు, లోయలు, పార్కులు ఇలా ఎన్నో అనుకుంటారు. అలానే పలువురు టూరిస్ట్ లో  జైళ్లను కూడా సందర్శించాలని భావిస్తుంటారు. అయితే నిజమైన కొన్ని జైళ్లలో టూరిస్టులను అనుమతిస్తున్నారు. ఈ జైల్లు వాటి చరిత్ర, ఆసక్తికరమైన కథలకు ప్రసిద్ధి చెందాయి.  అలా భారతదేశ ఆసక్తికరమైన చరిత్రతో ముడిపడి ఉన్న భారతదేశంలో ఉన్న జైళ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మనం తెలుసుకునే వాటిల్లో మొదటిది  అండమాన్ లోని సెల్యులార్ జైలు. ఇది అండమాన్ రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ ఉంది. ఈ జైలు ఇండియా ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న కాలా పానీ పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు ఫ్రీడమ్ ఫైటర్స్  బతుకేశ్వర్ దత్ మరియు వీర్ సావర్కర్ ల ధైర్యసాహసాలు గురించి ఈ జైల్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ జైలు యాత్రికుల కోసం తెరవబడింది.

అలానే ప్రసిద్ధి చెందిన ఎర్రవాడ జైలుకు కూడా టూరిస్టలను అనుమతిస్తారు. ఇది మహారాష్ట్రంలోని పూణే లో ఉంది. ఇదిదక్షిణ ఆసియాలో అతిపెద్ద జైలు. అలానే భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో వంటి ప్రముఖులు ఇక్కడే జైలు జీవితం గడిపారు.

భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్‌ అని చెబుతారు. ఈ జైలు దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు రకాల వస్తువును తయారు చేస్తారు. వాటిని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ జైల్లో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. అలానే మన సౌత్ ఇండియాలో సంగారెడ్డి జైలు చాలా ఫేమస్. తెలంగాణలోని 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది.

ప్రస్తుతం సంగారెడ్డి జైలు యాత్రికుల కోసం మ్యూజియంగా దర్శన మిస్తుంది. ‘ఫీల్ ది జైల్’ పథకం కింద ఎవరైనా ఈ జైలును సందర్శించి ఆనందించవచ్చు. ఈ స్కీమ్ కింద 24 గంటలు జైలులో గడపవచ్చు. అలానే అండమాన్ లోని వైపర్ ఐలాండ్ జైలు చాలా  ఫేమస్. ఇది సెల్యూలార్ జైలులాగా మాత్రం ప్రాచుర్యం పొందలేదు. ఇది ఇడియా స్వాతంత్ర ఉద్యమం నాటి చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపం సాధారణ ప్రజలకు తెరవబడింది. ఇలా ఖైదీలా పైన తెలిపిన జైళ్లలు టూరిస్టులు వెళ్లొచ్చు.