iDreamPost
android-app
ios-app

వీడియో: నీళ్ల కోసమని బోరింగ్‌ దగ్గరికి వచ్చిన యువతిపై దారుణం!

మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అని ఓ సినీ కవి అన్నట్లుగా.. నీళ్లు కోసం సాటిి మనిషి అందులోనూ మహిళ అని కూడా చూడకుండా అమానుషంగా

మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అని ఓ సినీ కవి అన్నట్లుగా.. నీళ్లు కోసం సాటిి మనిషి అందులోనూ మహిళ అని కూడా చూడకుండా అమానుషంగా

వీడియో: నీళ్ల కోసమని బోరింగ్‌ దగ్గరికి వచ్చిన యువతిపై దారుణం!

ఎండలు మండుతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం 8 గంటల నుండి సూర్యుడి వేడి సర్రుమంటూ తాకుతోంది. మధ్యాహ్నం బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే వేడి గాలులు కూడా ఊపందుకుంటున్నాయి. భానుడి భగ భగల సమయంలో బయటకు వెళ్లొద్దంటూ వాతావరణ హెచ్చరికలు కూడా చేస్తోంది. ఉష్ణ తాపం కారణంగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ సారి ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని హెచ్చరిస్తోంది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెబుతోంది. ఇక ఈ ఎండ వేడిమికి నీటి కష్టాలు మొదలయ్యాయి.

ఇప్పటికే బెంగళూరు వంటి నగర వాసులు నీటికి కట కటలాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో వాటర్ ట్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఒక్క బెంగళూరే కాదు.. దేశంలో వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఇక పల్లెటూళ్ల, మారుమూల ప్రాంతాల్లో బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. నీటి కోసం బారులు తీరే పరిస్థితి. గొంతు తడుపుకునేందుకు మైళ్ల దూరం నడిచి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. గక్కెడు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. తాజాగా ఈ నీటి కోసం ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నీళ్లు నింపుకుందామని వచ్చిన ఓ మహిళను దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.

సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కిషన్ పూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి చేతి పంపు వద్దకు నీళ్లు నింపుకోవడానికి వచ్చింది ఓ మహిళ. ఆ వాడలోని కొంత మంది మహిళలు నీవు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఎందుకు తనను నీళ్లు పట్టుకోనివ్వడం లేదని నిరసనకు దిగింది సదరు మహిళ. అంతే.. ఆమెపై కోపంతో ఊగిపోయారు మహిళలు. అక్కడే ఉన్న వ్యక్తికి ఫిర్యాదు చేయగా.. అతడు మహిళ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ దాడి చేశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వదలకుండా.. జుట్టు పట్టుకని నేలకేసి కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.