iDreamPost

జైలు నుంచి పోటీ చేసి.. విజయం దిశగా దూసుకెళ్తున్న ఖలిస్థానీ మద్దతుదారుడు!

  • Published Jun 04, 2024 | 1:01 PMUpdated Jun 04, 2024 | 1:01 PM

Waris De Punjab, Amritpal Singh: ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్‌ దే పంజాబ్‌ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ జైలు నుంచి పోటీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు? ఎంత ఆధిక్యంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖలిస్థానీ మద్దుతుదారుడు, వారిస్‌ పంజాబ్‌ దే చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో అలజడులకు కారణం అయ్యాడనే ఆరోపణలతో అరెస్ట్‌ అయి ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉన్నాడు. అయితే.. ఈ లోక్‌ సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో అమృత్‌పాల్‌ సింగ్‌ భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉంది విజయం దిశగా చూసుకెళ్తున్నాడు.

ఉదయం 11 గంటల సమయంలోనే 64 వేలకు పైగా లీడ్‌లో కొనసాగాడు అమృత్‌పాల్‌ సింగ్‌. ప్రస్తుతం ఆ లీడ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. సమీప ప్రత్యర్థి కుల్‌బీర్‌ సింగ్‌ జీరా కంటే అమృత్‌పాల్‌ సింగ్‌ భారీ ఆధిక్యంలో ఉన్నారు. కుల్‌బీర్ సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసిన లాల్‌జిత్‌ సింగ్‌ భుల్లార్‌ మూడో స్థానంలో ఉన్నారు. గతేడాది ఫిబ్రవరీలో తమ నేత అరెస్ట్‌ను ఖండిస్తూ.. అమృత్‌పాల్‌ సింగ్‌ నేతృత్వంలో వారిస్‌ దే పంజాబ్‌ నేతలు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆ ఘటనతో సీరియస్‌ అయిన ప్రభుత్వం అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత దేశ భద్రతా చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి.. దిబ్రూగఢ్‌ జైలుకు తరలించింది. అయితే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అమృత్‌పాల్‌ సింగ్‌ తొలుత సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. కానీ, వారిస్‌ దే పంజాబ్‌ నేతలు, అతని మద్దతు దారులు పట్టుబట్టడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయక తప్పలేదు. ఇప్పుడు ఒక వేళ ఆయన గెలిస్తే.. జైలులో ఉండి విజయం సాధించిన నేతగా అమృత్‌పాల్‌ సింగ్‌ రికార్డు నమోదు చేస్తారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి