iDreamPost
android-app
ios-app

విమాన ప్రయాణికులకు అలెర్ట్.. సెప్టెంబర్ 3 నుంచి విస్తారా బుకింగ్స్ బంద్!

Vistara Bookings to close from Sept 3: ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ విస్తారా ప్రయాణికులకు అనేక సేవలు అందిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ విస్తారా విషయంలో ఓ కీలక న్యూస్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి విస్తారా బుకింగ్స్ బంద్ కానున్నాయి.

Vistara Bookings to close from Sept 3: ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ విస్తారా ప్రయాణికులకు అనేక సేవలు అందిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ విస్తారా విషయంలో ఓ కీలక న్యూస్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి విస్తారా బుకింగ్స్ బంద్ కానున్నాయి.

విమాన ప్రయాణికులకు  అలెర్ట్.. సెప్టెంబర్ 3 నుంచి విస్తారా బుకింగ్స్ బంద్!

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ విస్తారా ప్రయాణికులకు అనేక సేవలు అందిస్తుంది. తరచూ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. అయితే త్వరలో విస్తారా  బుకింగ్స్ నిలిచిపోనున్నాయి. ఎయిరిండియాతో విస్తారా విలీనం కానున్నా సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 11న విస్తారా బుకింగ్ ద్వారా చివరి ఫ్లైట్ నడవనుంది. అనంతరం ఆ సంస్థ ఫ్లైట్స్ అన్ని ఎయిరిండియా కంట్రోల్  లోకి వెళ్తాయి. బుకింగ్ లు సైతం ఎయిరిండియా వెబ్ సైట్ నుంచి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ బుకింగ్ సేవలు నిలిపోనున్నాయి. అయితే విస్తారా ఆధర్వంలో నవంబర్ 11 వరకు ప్లైట్ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని ఆ సంస్థ పేర్కొంది.

శుక్రవారం సింగపూర్ ఎయిర్ లైన్స్ కీలక విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే విస్తారా ప్రస్తావన వచ్చింది.  ఎయిరిండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనం  చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం నుంచి తమకు పర్మిషన్  లభించిందని  సింగపూర్ ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఈ తాజా అనుమతులతో  ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 25.1 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. దీంతో ఈ ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ అనేది ఈ ఏడాది చివరికి పూర్తయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Vistara bookings bandh from September 3

ఈ రెండు ఎయిర్ లైన్స్ ల  విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. ఇక ఈ రెండు ఎయిర్ లైన్స్ ల యాజమాన్య వివరాల గురించి చూసినట్లు అయితే.. టాటా గ్రూప్ నిర్వహణలో ఎయిరిండియా ఉంది. అలానే విస్తారా వచ్చేసి.. టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ మధ్య 51:49గా ఉమ్మడి నిర్వహణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియాను, విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఎఫ్‌డీఐ కింద ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ కొన్ని వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆ కొనుగోలకు తాజాగా భారత ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌  తెలిపింది. భారత చట్టాల ప్రకారం.. మరిన్ని నిబంధనలు, అనుమతులకు లోబడి మరికొన్ని నెలల్లో  ఈ రెండు సంస్థల విలీనం పూర్తవుతుందని పేర్కొంది. అక్టోబర్‌ 31 నాటికే విలీనం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ, వివిధ కారణాలతో గడువును పొడిగించే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఇక విస్తారా, ఎయిర్ ఇండియా విలీనం పూరైతే.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలుస్తుంది. ఎయిరిండియాతో విలీనం నేపథ్యంలో నవంబర్ 11న విస్తారా చివరి ఫ్లైట్ నడవనుంది. అదే విధంగా సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్‌లు ఆగిపోనున్నాయి.