iDreamPost
android-app
ios-app

మార్చి నుంచి వందేభారత్‌ తొలి స్లీపర్‌.. తొలి రైలు ఈ రూట్‌లోనే!

  • Published Feb 07, 2024 | 9:33 PM Updated Updated Feb 07, 2024 | 9:33 PM

ఇప్పటికే వందే భారత్ రైళ్లు దేశావ్యాప్తంగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీస్ ను మరింత అప్ డేట్ చేస్తూ ఇక నుంచి సదుపాయాన్ని కూడా రైల్వే సంస్థ ప్రయాణికులకు కల్పిస్తుంది. ఇంతకి అదేమిటంటే..

ఇప్పటికే వందే భారత్ రైళ్లు దేశావ్యాప్తంగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీస్ ను మరింత అప్ డేట్ చేస్తూ ఇక నుంచి సదుపాయాన్ని కూడా రైల్వే సంస్థ ప్రయాణికులకు కల్పిస్తుంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Feb 07, 2024 | 9:33 PMUpdated Feb 07, 2024 | 9:33 PM
మార్చి నుంచి  వందేభారత్‌ తొలి స్లీపర్‌.. తొలి రైలు ఈ రూట్‌లోనే!

దేశంలో వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులోకి తేవడంతో చాలామంది ప్రయాణికులు ఎంతో ఉపాయోగకరంగా మారింది. ఎందుకంటే.. ఇదివరకు ఏ నగరాలకైన వెళ్లాలంటే ప్రయాణ సమాయం చాలా ఎక్కువ పట్టేది. కానీ, ప్రస్తుత కాలంలో వీటి సర్వీసులు అందుబాటులోకి రావడంతో చాలామంది ప్రయాణికులకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అయ్యింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్ అటు సికింద్రాబాద్-విశాఖపట్నకు, సికింద్రాబాద్-తిరుపతి కు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సర్వీస్ ను మరింత అప్ డేట్ చేస్తూ ఇక నుంచి ఆ సదుపాయాన్ని కూడా ప్రయాణికులకు అందుబాటులో తెస్తున్నాట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇంతకి అదేమిటంటే..

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇక నుంచి.. స్లీపర్‌ రైళ్ల ట్రయల్‌ రన్‌ గా మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సర్వీసులను ఏప్రిల్‌లో నెల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే తొలి రైళ్లను ఢిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇక రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైళ్లలో 16 నుంచి 20 వరకు ఏసీ, నాన్‌-ఏసీ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. వీటి వలన దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణ దూరం ఉండే రూట్లకు ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ వందే భారత్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో డిజైన్‌ చేశారు.

పైగా ఇప్పటి వరకు ఉండే భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ఈ రకంగా ప్రయాణం సమయం రెండు గంటలు దాకా ఆదా అవుతుంది. అయితే వీటిని మొదట పది రూట్లలో అందుబాటులోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారతీయ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు వివిధ నగరాల మధ్య సర్వీస్‌లను అందిస్తున్నాయి. కాగా, త్వరలో.. వందే మెట్రో రైలును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇక తాజాగా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో.. భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. మరి, త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.