SNP
UPS, NPS, Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త పెన్షన్ స్కీమ్.. యూపీఎల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎన్‌పీఎల్‌కి, యూపీఎస్‌కి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
UPS, NPS, Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త పెన్షన్ స్కీమ్.. యూపీఎల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎన్‌పీఎల్‌కి, యూపీఎస్‌కి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రభుత్వ ఉద్యోగుల కోసం.. కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇటీవలె దీనికి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు, ఎన్‌పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్)లో భాగమైన వారు.. ఈ యూపీఎస్(యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)లో చేరవచ్చు. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ విధానం వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్ నుంచి అమలు కానుంది. మరి ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌తో ప్రయోజనాలేంటి? ఇప్పటికే ఉన్న ఎన్‌పీఎస్‌కి దీనికి తేడా ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగమైన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో కొంత మొత్తంలో డబ్బుతో పాటు.. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల పెన్షన్ అందించనుంది.
UPS కింద.. మీరు 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేస్తే, మీరు మునుపటి 12 నెలలకు మీ సగటు వేతనంలో 50 శాతం పెన్షన్‌గా అందుకుంటారు. ద్రవ్యోల్బణం కోసం డియర్‌నెస్ అలవెన్స్‌తో అడ్జెస్ట్ చేస్తారు.
UPSలో ఉద్యోగి కాంట్రీబ్యూషన్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 14 నుంచి 18.5 శాతానికి పెంచుతుంది.
UPS కింద రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీతో పాటు సూపర్‌యాన్యుయేషన్‌లో ఒకేసారి చెల్లింపు ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఆరు నెలలకు మీ నెలవారి వేతనాలలో 1/10వ వంతు అవుతుంది. అందులో పే ప్లస్ డీఏ ఉంటుంది. అయితే.. ఈ చెల్లింపులు పెన్షన్ అమౌంట్ నుంచి తగ్గించరు.
ఒక వేళ ఏదైన కారణంతో పెన్షన్‌దారుడు చనిపోతే.. అతని కుటుంబానికి అప్పటి వరకు పెన్షన్‌దారుడు పొందుతున్న పెన్షన్‌లో 60 శాతం పెన్షన్‌గా ప్రతి నెలా చెల్లిస్తారు. 20 వేలు పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే.. అతని కుటుంబానికి 12 వేలు పెన్షన్‌గా చెల్లిస్తారు.
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారికి కూడా UPS నిబంధనలు వర్తిస్తాయి. పాత బకాయిలు PPF రేట్ల ప్రకారం వడ్డీతో సహా చెల్లిస్తారు.
కొత్త పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌లో చేరిన తర్వాత.. మళ్లీ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లోకి మారేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అలా మారడానికి అవకాశం లేదు. కానీ, ఎన్‌పీఎస్ నుంచి మాత్రం యూపీఎస్‌కి మారొచ్చు.
ఉద్యోగులు కొత్త పథకానికి మారడం మంచిదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే.. NPS కింద, పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. ఇండియాలో యాన్యుటీ రేట్లు తక్కువగా ఉన్నందున, పెట్టుబడిపై 50 శాతం రాబడిని సాధించడం కష్టం. కానీ, UPS కింద 50 శాతం పెన్షన్ సురక్షితంగా ఉంటుంది.
UPS కింద 25 సంవత్సరాల సర్వీస్ తర్వాత రిటైర్ అయితే.. రిటైర్ అయ్యే ముందు చివరి 12 నెలలు వారు పొందిన వేతనంలో 50 శాతం పెన్షన్‌గా పొందుతారు. అయితే.. షార్ట్ సర్వీస్ ఉన్నవాళ్లు.. మినిమమ్ 10 ఏళ్ల సర్వీస్ ఉంటే నెలలకు 10 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది.