iDreamPost
android-app
ios-app

నాకు భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి.. కరెంట్‌ పోల్‌ ఎక్కి మహిళ ధర్నా!

  • Published Apr 04, 2024 | 3:41 PM Updated Updated Apr 04, 2024 | 3:41 PM

లవర్, భార్య కోసం కరెంట్ పోల్ ఎక్కిన పురుషులను చూశాం. కానీ తాజాగా ఓ మహిళ ఈ పని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకు ఆమె డిమాండ్ ఏంటంటే..

లవర్, భార్య కోసం కరెంట్ పోల్ ఎక్కిన పురుషులను చూశాం. కానీ తాజాగా ఓ మహిళ ఈ పని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకు ఆమె డిమాండ్ ఏంటంటే..

  • Published Apr 04, 2024 | 3:41 PMUpdated Apr 04, 2024 | 3:41 PM
నాకు భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి.. కరెంట్‌ పోల్‌ ఎక్కి మహిళ ధర్నా!

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చు మీరిపోతున్నాయి. జీవిత భాగస్వామిని కాదని.. క్షణకాల సుఖం కోసం ఏర్పర్చుకున్న బంధాల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఇలాంటి బంధాలు కొనసాగిస్తున్న వారిలో ఆడ, మగ ఇద్దరూ ఉంటున్నారు. లవర్ కోసం కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలను సైతం కడతేరుస్తున్నారు కొందరు. ఇక మరి కొందరైతే వెరైటీ కోరికలు కోరుతున్నారు. జీవిత భాగస్వామి, లవర్ ఇద్దరూ కావాలని పోలీస్ స్టేషన్ లకు వెళ్తున్నారు. తాజాగా ఓ మహిళ ఇంతకు మించిన ఘనకార్యం చేసింది. ఆ వివరాలు..

భర్త, పిల్లలున్న ఓ మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. చివరకు అది బయటపడటంతో ఇద్దరితో కలిసి ఉంటానంటూ మొండిపట్టు పట్టింది. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో.. ఏకంగా కరెంట్‌ పోల్‌ ఎక్కి బెదిరించసాగింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం నాడు వెలుగు చూసింది.

స్థానిక మీడియ కథనం ప్రకారం పిప్రాయిచ్‌ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం కూడా. ఏడేళ్ల క్రితం వరకు ఆ దంపతులు బాగానే ఉన్నారు. కానీ 7 ఏళ్ల క్రితం సదరు మహిళకు పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఇటీవల భర్తకు వీరి విషయం తెలియడంతో ఆమెను నిలదీశాడు.

దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సదరు మహిళ ఓ విచిత్ర కోరిక కోరింది. వారితో పాటు ప్రియుడు కూడా ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయని చెప్పింది. కానీ అందుకు ఆమె భర్త అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.

ఈ క్రమంలోనే గ్రామంలోని విద్యుత్‌ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌ చేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా సదరు మహిళను కిందకు దించాల్సి వచ్చింది. తర్వాత ఇరు కుటంబాల వారితో మాట్లాడి పంపించారు. ఈ సంఘటన గురించి తెలిసిన వాళ్లు.. నిజంగా నువ్వు మహిళల్లో స్వాతిముత్యానివి తల్లి అంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbettilt girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş