UP Cop Demands Potato: రైతుని 5 కిలోల బంగాళదుంపలు లంచంగా అడిగిన ఎస్సై సస్పెండ్!

UP Cop Demands Potato: రైతుని 5 కిలోల బంగాళదుంపలు లంచంగా అడిగిన ఎస్సై సస్పెండ్!

SI Suspended For Asked Potatoes: ఒక రైతు ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అయితే పోలీసులు ఆ రైతుని ఒక 5 కిలోల బంగాళదుంపలు అడిగారు. అలా అడిగినందుకే ఎస్సైని పై అధికారులు సస్పెండ్ చేశారు. బంగాళాదుంపలు అడిగితే సస్పెండ్ చేస్తారా?

SI Suspended For Asked Potatoes: ఒక రైతు ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అయితే పోలీసులు ఆ రైతుని ఒక 5 కిలోల బంగాళదుంపలు అడిగారు. అలా అడిగినందుకే ఎస్సైని పై అధికారులు సస్పెండ్ చేశారు. బంగాళాదుంపలు అడిగితే సస్పెండ్ చేస్తారా?

పోలీస్ స్టేషన్ ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికి. పోలీసులు ప్రజా సేవకులు. ప్రజలకు ఏదైనా ఆపద వస్తే ముందు తలచుకునేది పోలీసులనే. అలాంటి ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు ఫైల్ చేయమంటే బంగాళాదుంపలు తీసుకురా.. కూరగాయలు తీసుకురా అని అడ్డమైన పనులు చేయిస్తారు. అందరూ అలా ఉండరు. కొంతమంది అలా ఉంటారు. రీసెంట్ గా విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో కూడా ఇంతే కదా. కేసు ఫైల్ చేయమని వస్తే హీరోని పనోడిగా వాడుకుంటారు. అయితే తాజాగా ఓ పోలీస్ మాత్రం కొత్తగా ట్రై చేశాడు. ఓ కేసు విషయమై ఒక రైతు తన దగ్గరకు వెళ్తే.. వెరైటీగా 5 కిలోల బంగాళాదుంపలు అడిగాడు. బంగాళాదుంపలు అడగడం ఏంటి? మార్కెట్లో బంగాళదుంపల కొరత లేదు కదా. వాటి రేట్లు కూడా మరీ ఎక్కువగా లేవు కదా. ఎవరైనా లంచంగా డబ్బులు అడుగుతారు. లేదా ఇంకేమైనా విలువైన వస్తువులు అడుగుతారు. కానీ ఈ పోలీసోడు ఏంటి బంగళాదుంపలు లంచంగా అడిగాడు అని అనుకుంటున్నారా?

అయితే అవి నిజంగా బంగాళదుంపలు కావు. అది ఆ పోలీసాయన కోడ్ లాంగ్వేజ్. అతని కోడి లాంగ్వేజ్ లో బంగాళాదుంపలు అంటే డబ్బులు. కిలో అంటే 5 వేలు, 10 వేలు ఇలా అన్న మాట. మొదట రైతు కూడా.. ‘అయ్.. ఇదేంటి బంగాళాదుంపలు’ అడుగుతున్నాడు అని బిత్తరపోయాడు. ఆ తర్వాత లంచం డిమాండ్ చేస్తున్నాడని తెలుసుకుని ఆ రైతు.. 2 కిలోల బంగాళదుంపలు ఇస్తానని చెప్పాడు. దానికి ఆ ఎస్సై ఒప్పుకోలేదు. రైతు మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి 3 కిలోల బంగాళదుంపలు ఇస్తానని రైతు చెప్పడంతో ఎస్సై అంగీకరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో చోటు చేసుకుంది. సారిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగల్పూర్ చపున్నా చౌకీలో ఎస్సైగా పని చేస్తున్న రామ్ కృపాల్ సింగ్.. కేసు కోసం వచ్చిన రైతుని 5 కిలోల బంగాళాదుంపలు అడిగాడు.

మూడో వ్యక్తికి తెలియకుండా ఉండడం కోసం ఆ ఎస్సై ఇలా లంచం కోసం బంగళాదుంపల కోడ్ ని పెట్టుకున్నాడు. కేసు పరిష్కారం కోసం వచ్చేవారిని బంగాళాదుంపల కోడ్ తోనే లంచం డిమాండ్ చేస్తూ వచ్చాడు. తాజాగా ఓ రైతుని కూడా అలానే డిమాండ్ చేయడంతో ఎస్సై వ్యవహారం బయటపడింది. తాజాగా దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ బిగినర్స్ కోసం కాదు అంటూ మీడియా ప్రతినిధి ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్టుని షేర్ చేశారు. కాగా ఎస్సైపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గర కూడా చేయి చాచే స్థాయికి దిగజారిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ బంగాళదుంపల కోడ్ ప్రకారం.. కిలో అంటే 5 వేలా? లేక 5 లక్షలా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.      

Show comments