iDreamPost
android-app
ios-app

వీడియో: టీచర్‌తో ప్రిన్స్‌పాల్‌ చెత్త పని! పవిత్రమైన వృత్తిలో ఉంటూ!

  • Published Jul 10, 2024 | 3:10 PM Updated Updated Jul 10, 2024 | 3:10 PM

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇద్దరు టీచర్లు.. అత్యంత నీచంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. వారిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వివరాలు..

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇద్దరు టీచర్లు.. అత్యంత నీచంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. వారిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Jul 10, 2024 | 3:10 PMUpdated Jul 10, 2024 | 3:10 PM
వీడియో: టీచర్‌తో ప్రిన్స్‌పాల్‌ చెత్త పని! పవిత్రమైన వృత్తిలో ఉంటూ!

గురువంటే సమాజానికి తోవ చూపే దిక్సుచి వంటి వారు. పురాతన కాలం నుంచి కూడా మన దేశంలో గురువుకు ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఎందుకంటే వారికి అక్షర జ్ఞానం ఉంది.. మంచి, చెడుల మధ్య బేధం తెలుసు.. విచక్షణతో వ్యవహరిస్తారనే నమ్మకం ఉండేది. రాజుల కాలంలో సైతం విద్యాబుద్ధులు నేర్పించే గురువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి.. గౌరవంగా చూసేవారు. అప్పటి టీచర్లు కూడా సమాజ హితం కోసం పని చేసేవారు. అయితే రాను రాను ఉపాధ్యాయ వృత్తిలో కొందరు కీచకులు బయల్దేరారు. గురువంటే తండ్రితో సమానం అన్న ఇంగితం మరిచి.. విద్యార్థినిలపై అఘాయిత్యాలకు పాల్పడటం ప్రారంభించారు.

మార్కుల పేరుతో వారిని బెదిరించి అగాయిత్యాలకు పాల్పడే గురువుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉపాధ్యాయులు స్కూల్‌ ప్రాంగణంలోనే బరి తెగించి ప్రవర్తించారు. బడిలోనే నీచానికి ఒడిగట్టారు. వారి వికృత చర్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

క్లాస్‌ రూమ్‌లోనే రొమాన్స్‌ చేసుకుంటూ లోకాన్ని మర్చిపోయారు ఓ స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌, మరో మహిళా ఉపాధ్యాయిని. వీరిద్దరి ఘనకార్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌లో చోటు చేసుకుంది. మహిళా ఉపాధ్యాయురాలు, స్కూల్‌ ప్రిన్సిపాల్‌.. పాఠశాల ప్రాంగణంలోనే రొమాన్స్‌ చేసుకుంటూ నీచానికి దిగజారారు.

వీరి వెనకే మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి, స్వతంత్ర సమరయోధులు చిత్ర పటాలు ఉండటం గమనార్హం. అయినా ఈ ఇద్దరు మాత్రం సిగ్గు, శరం లేకుండా ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. బెడ్రూంలో ఉన్నట్లుగా ప్రవర్తించారు. మూడు రోజుల క్రితం అనగా ఆదివారం నాడు వీడియోని పోస్ట్‌ చేయగా.. ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఇలాంటి టీచర్లు ఉండటం సమాజానికి సిగ్గు చేటు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇలాంటి టీచర్లు పిల్లలకు ఏం చెబుతారు.. ఎలా ఆదర్శంగా ఉంటారు.. వీరి లాంటి వల్లే విద్యార్థుల్లో కూడా ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు వస్తున్నాయి.. వీరిని వదిలిపెట్టకూడదు.. కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss