iDreamPost
android-app
ios-app

భార్య మరొకరిని ప్రేమించిందని తెలిసి.. అతడేం చేశాడంటే

  • Published Sep 24, 2023 | 2:00 PM Updated Updated Sep 24, 2023 | 2:00 PM
  • Published Sep 24, 2023 | 2:00 PMUpdated Sep 24, 2023 | 2:00 PM
భార్య మరొకరిని ప్రేమించిందని తెలిసి.. అతడేం చేశాడంటే

ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు అంతు లేకుండా పోతుంది. ప్రేమను దక్కించుకోవడం కోసం.. చివరికి కన్నవారిని, తోడబుట్టిని వారిని సైతం కడతేరుస్తున్నారు. ఆఖరికి పెళ్లి అయిన వారు సైతం.. వివాహం తర్వాత కూడా ప్రేమించిన వారి కోసం.. కట్టుకున్న వారిని వదిలి వెళ్ళడం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. ప్రేమించిన వాళ్ల కోసం జీవిత భాగస్వామిని కూడా హతమారుస్తున్నారు. ఇలాంటి దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు.. తమ జీవిత భాగస్వాముల ప్రేమ విషయం తెలుసుకుని.. లవ్‌ చేసని వారితో వారిని కలుపుతున్నారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకున్న వ్యక్తి.. ఏం చేశాడంటే..

సినిమాను తలపించే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ దేవరియా జిల్లాలోని బరియార్‌పుర్‌నగర్‌ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి.. సంవత్సరం క్రితం బిహార్‌, గోపాల్‌గంజ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఏడాది నుంచి దంపతులు కలిసిమెలిసి ఉన్నారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో.. వివాహితను గతంలో పేమించిన వ్యక్తి.. ఆమె అత్తగారింటికి వచ్చాడు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు.. అతడిని చితకబాదారు.

అయితే తన భార్య పెళ్లికి ముందే ఆ యువకుడిని ప్రేమించిందని తెలుసుకున్న ఆమె భర్త.. వారి ప్రేమను అర్థం చేసుకున్నాడు. దాంతో పెద్ద మనసు చేసుకుని.. తన భార్య ప్రేమించిన వ్యక్తితో ఆమె వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లిదండ్రులు, భార్య అమ్మనాన్నలను ఈ పెళ్లికి ఒప్పించాడు. తర్వాత ఒక ఆలయంలో భార్యకు దగ్గరుండి ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాడు. విషయం తెలసుకున్న జనాల్లో కొందరు అతడి నిర్ణయాన్ని ప్రశంసించగా.. మరి కొందరు మాత్రం ఇదేం పోయే కాలం.. ఇలా చేశాడు అంటూ విమర్శిస్తున్నారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş