iDreamPost

త్వరలోనే విమానమంత బస్సు.. ఎయిర్‌ హోస్టేస్‌ మాదిరే బస్‌ హోస్టెస్‌

  • Published Jul 03, 2024 | 12:26 PMUpdated Jul 03, 2024 | 12:26 PM

ప్రస్తుతం దేశంలోని పర్యావరణ కాలుష్యన్ని నివారించేందుకు విద్యుత్, గ్యాస్ తో నడిచే వాహనాల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే పర్యావరణ కాలుష్య సమస్యను మరింత తగ్గించేందుకు ఓ నగరంలో 132 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం మాదిరి బస్సును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..

ప్రస్తుతం దేశంలోని పర్యావరణ కాలుష్యన్ని నివారించేందుకు విద్యుత్, గ్యాస్ తో నడిచే వాహనాల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే పర్యావరణ కాలుష్య సమస్యను మరింత తగ్గించేందుకు ఓ నగరంలో 132 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం మాదిరి బస్సును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 03, 2024 | 12:26 PMUpdated Jul 03, 2024 | 12:26 PM
త్వరలోనే విమానమంత బస్సు.. ఎయిర్‌ హోస్టేస్‌ మాదిరే బస్‌ హోస్టెస్‌

ప్రస్తుతం దేశంలోని ఎక్కడ చూసిన విద్యుత్, గ్యాస్ తో నడిచే వాహనాల వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. పైగా ప్రజలు కూడా ఈ వాహనాలను వినియోగించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా దీని వలన పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ప్రజలు ఆరోగ్యం పై కూడా ఎటువంటి ప్రభావం చూపదు. అయితే ఒకప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలతో రైళ్లు , వాహనాలు నడిచేవి. కానీ, ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో.. ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నూతన ఆలోచనలతో ఇంధనాలు లేని వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాగా, ఇప్పటికే ఓ పక్క ఈ కాలుష్యంను పూర్తిగా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకే తాజాగా దేశంలో పర్యావరణహితమైన ఇంధనం సాయంతో.. 132 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ జాతీయ మీడియా అవార్డు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే 132 సీట్ల సామర్థ్యంతో బస్సు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. అయితే ఈ బస్సును నాగ్‌పూర్‌లో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని, పైగా విమానం మాదిరిగా సీట్లు, బస్ హోస్టెస్ ఇందులో ఉంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం ఉన్న డీజిల్ వాహనాల కంటే చవకైన పర్యావరణహితమైన ఇంధనం సాయంతో ఈ బస్సును నడపనున్నామని’ కేంద్ర మంత్రి చెప్పారు. అయితే దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో ఉండే  కాలుష్యం, పర్యావరణ సమస్యల వలన కాలుష్య రహిత వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు.

 ఇకపోతే  ఈ బస్సుకు  తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ రవాణా పరిష్కారాలు అవసరం. అయితే మన దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 300 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే.. ఆటోమొబైల్  కంపెనీ పర్యావరణహిత వాహనాలను తయారుచేస్తున్నాయి. ఇక దానికి లీటరుకు రూ. 120 ఖర్చయితే.. ఇథనాల్‌కు అందులో సగం అంటే రూ.60 మాత్రమే అవుతుంది. అలాగే 60 శాతం విద్యుత్, 40 శాతం ఇథనాల్‌తో వాహనాలు నడపనున్నాయి. దీని వల్ల కాలుష్యం తగ్గుతుందని మంత్రి వివరించారు. ఇక ఈ డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటరకు రూ.115 ఖర్చయితే, రాయితీలతో కలిపి ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు రూ.41, నాన్-ఏసీకి రూ.37 ఖర్చవుతుంది. ఒకవేళ రాయితీలు లేకుంటే రూ.50 నుంచి రూ.60 వరకూ ఉంటుంది. దీని వల్ల ప్రజలపై కూడా టిక్కెట్ భారం 15 నుంచి 20 శాతం వరకూ తగ్గుతుందని ఆయన  అన్నారు. అలాగే 132 మంది కూర్చునే సామర్థ్యం  కలిగిన ఈ బస్సులో.. రింగ్ రోడ్‌లో 49 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.

అలాగే 40 కి.మీ తర్వాత బస్‌స్టాప్‌లో ఆగుతుంది. ఇక కేవలం 40 సెకన్లలో తదుపరి 40 కి.మీకి ఛార్జ్ అవుతుంది.. దీని కోసం కిలోమీటరుకు రూ. 35-40 ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. దీంతో పాటు సీట్ల ముందు ల్యాప్‌టాప్ పెట్టుకోడానికి స్థలం, సౌకర్యవంతమైన కుర్చీలు, ఎయిర్‌ కండిషన్ అవసరం ఉండలా రూపకల్పన చేస్తున్నాం. ఇక అందులో ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా ప్రయాణికులకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, పానీయాలు అందజేయడానికి బస్ హోస్టెస్‌లు ఉండాలి ప్లాన్ చేస్తున్నాం. ఇక దీనికి   డీజిల్ బస్సు కంటే 30 శాతం తక్కువ ఖర్చు అవుతుంది అని ఆయన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి