iDreamPost
android-app
ios-app

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత.. స్టేజ్ పైనే!

  • Published Apr 24, 2024 | 7:18 PM Updated Updated Apr 24, 2024 | 7:20 PM

భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన స్టేజ్ పైనే ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన స్టేజ్ పైనే ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.

  • Published Apr 24, 2024 | 7:18 PMUpdated Apr 24, 2024 | 7:20 PM
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత.. స్టేజ్ పైనే!

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. ప్రముఖ లీడర్లు అంతా ప్రచారంలో మునిగి పోయారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. దేశంలో ఎండల వేడికంటే రాజకీయ వేడే ఎక్కువగా ఉందనడంలో సందేహం లేదు. కాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థతకు గురయ్యారు.మహారాష్ట్ర – పుసాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇదిగమనించిన అక్కడి వారు వెంటనే నితిన్ గడ్కరీని పైకి లేపి సహాయక చర్యలు అందించారు. ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా కొంత సమయం తర్వాత నితిన్ గడ్కరీ ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. తాను అస్వస్థతకు గురికావడానికి గల కారణాన్ని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అసౌకర్యానికి లోనయ్యానని.. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో ఈసాని నితిన్ గడ్కరీ నాగ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా ఇది వరకు 2018లో కూడా నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపైనే కుప్పకూలిపోయారు. కాగా నితిన్ గడ్కరీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలపడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom