iDreamPost
android-app
ios-app

రాజ్యాంగం భగవద్గీతేం కాదు.. మారిస్తే తప్పేంటి..? : గజేంద్ర సింగ్

  • Published Apr 24, 2024 | 10:05 AM Updated Updated Apr 24, 2024 | 10:05 AM

Gajendra Singh Comments on The Constitution: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Gajendra Singh Comments on The Constitution: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

  • Published Apr 24, 2024 | 10:05 AMUpdated Apr 24, 2024 | 10:05 AM
రాజ్యాంగం భగవద్గీతేం కాదు.. మారిస్తే తప్పేంటి..? : గజేంద్ర సింగ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు మొదటి దశ పూర్తయ్యింది. త్వరలో రెండోదశ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనా కేంద్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హూరాహోరీ యుద్దం సాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో అధినేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు మాట యుద్దానికి దిగుతున్నారు.  ఈ క్రమంలోనే నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా రాజ్యంగంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున రాజ్యాంగాన్ని మర్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి ఊతమందిస్తూ.. రాజ్యంగంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచల వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగం ఏమీ భగవద్గీత కాదు కదా? జాతీయ ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటీ? అని అన్నారు. ఓ కార్యక్రంలో మాట్లాడిన కేంద్ర మంత్రి గజేంద్ర.. ‘భారత రాజ్యంగం భగవద్గీత కాదు. గీతలో శ్లోకాలను మనం మార్చలేం.. కానీ జాతీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న రాజ్యంగంలోని కొన్నిఅంశాలను మార్చితే తప్పేంటి? రాజ్యంగ సవరణ గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగింది. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు కూడా రాజ్యంగ సవరణతోనే సాధ్యమైంది. దేశ ప్రయోజనాల కోసం ఆ సవరణ చేశాం’ అని అన్నారు.

ఎన్నికల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తే.. రాజ్యాంగంలో పలు మార్పులు తీసుకు వస్తాం అని అన్నారు గజేంద్ర సింగ్. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు లల్లు సింగ్, జ్యోతి మిర్దా, అరున గోవిల్, అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమైంది.దేశంలో అవినీతికి పాల్పపడిన వారిని బీజేపీలో చేర్చుకుంటున్నారు.. అని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. దానికి సమాధానంగా ‘ మా పార్టీ గంగ లాంటిది.. గంగ ఎన్నో పిల్ల కాలువలను తనలో కలుపుకున్నట్లే, మా పార్టీలో చేరాలనుకునేవారిని మేం చేర్చుకుంటాం. గంగలో కలవని పిల్ల కాలువలు భానుడి ప్రతాపానికి ఎండిపోవాల్సిందే’ అని సమాధానం ఇచ్చారు గజేంద్ర సింగ్ షెకావత్.