కేంద్ర బడ్జెట్ 2024..భారీగా తగ్గనున్న వీటి ధరలు!

Union Budget 2024: మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్... పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

Union Budget 2024: మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్... పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

ఎప్పుడైనా సరే కేంద్ర బడ్జెట్ ప్రవేపెట్టే సమయంలో అందరి ఆసక్తి దానిపైనే ఉంటుంది. ఆ సందర్భంలో ఆర్థిక మంత్రి ప్రకటించే అంశాలపై ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఏ ఏ రంగాలకు ఎంత మేర నిధులు కేటాయిస్తారు. అలానే విద్యా, వైద్యం, ఉపాధి రంగానికి ఏ విధంగా నిధుల కేటాయింపులు, అలానే పన్నుల అంశంపై ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి ఉంటుంది. ఇదే సమయంలో బడ్జెట్ ప్రకటనతో వేటి ధరలు తగ్గాయా?, వేటి ధరలు పెరుగుతాయి అనే విషయం తెలుస్తోంది. అలానే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు.  క్రమంలో ఈసారి కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. మరి.. ఆ వివరాలు…

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.​ ఈ క్రమంలోనే  పార్లమెంట్ లో తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయినప్పుడు నిర్మల సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. తాజాగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏడోవది. ఈ సారీ బడ్జెట్ లో మహిళలకు, పేదలకు, యువతకు, నిరుద్యోగులకు భారీగా నిధులు కేటాయించారు.

ఇదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. మందులు, వైద్య పరికరాలు, మొబైల్  ఫోన్లు, ఛార్జర్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి. అలానే దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సీ ఫుడ్ , లెదర్, టైక్సెటైల్ లోని చెప్పులు, షూస్ , దుస్తులు, బ్యాగుల ధరలు తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు విద్యుత్ వైర్‌లు, ఎక్స్ రే యంత్రాలు చౌకగా లభిస్తాయి. మూడు కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. ఇదే సమయంలో ఆదాయపు పన్నుపై  కూడా ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదన్నారు. బడ్జెట్ 2024లో కేంద్రం పట్టణాభివృద్ధికి నిధులు బాగా కేటాయించారు.

అలానే యువతకు కూడా భారీ వరాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలతోపాటు 10 వేల బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు, ఉపాధి, నైపుణ్యాల కోసం 3 పథకాలు తీసుకురానుంది. 5 సంవత్సరాల్లో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాల్లో అభివృద్ధి చేసేలా 5 పథకాలు తీసుకొస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రధాన మంత్రి పేరుతో ప్యాకేజీ రూపంలో ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు. ఇలా ఈసారీ బడ్జెట్ కాస్తా భిన్నంగానే ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా తాజాగా కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో త్వరలో వాటి ధరలు తగ్గనున్నాయి.

Show comments